mt_logo

పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును కృష్ణా ట్రిబ్యూనల్ కొట్టివేయడం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది పాలమూరు విజయం అని అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పుతో సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయినట్లుగా భావించవచ్చన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇప్పటికే అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జల శాఖ, విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతులు ఇచ్చింది. ఈ విజయానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే అని స్పష్టం చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అడ్డంకులు కేంద్రం వెంటనే గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని కేంద్రాన్ని మంత్రి డిమాండ్ చేశారు.