mt_logo

అమెరికాలో ఐటీ మంత్రి కేటీఆర్ బిజీబిజీ..

రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని శాప్(ఎస్ఏపీ) బిల్డింగ్ లో నాస్కాం ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి టీ హబ్ కు సంబంధించిన అన్ని అంశాలను వివరించారు. భారీ ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో ప్రాముఖ్యత సంతరించుకుందని, టీ హబ్ కార్యక్రమం వల్ల హైదరాబాద్ లోనే కాక దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

టీ హబ్ పై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్న వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. టీ హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీలకు సిలికాన్ వ్యాలీలో అవకాశాలు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాస్కామ్ తరపున వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, రవి గుర్రాల, సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులు పీకే గులాటీ, సునీల్ ఎర్రబెల్లి, నిశిత్ దేశాయ్, మైక్రో సాఫ్ట్ వెంచర్ తరపున రవి నారాయణన్, బ్లూమ్ వెంచర్ తరపున కార్తీక్ రెడ్డి, సంజయ్ నాథన్ లు హాజరయ్యారు. అనంతరం ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్ విడియా కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డెబోరా సీ షోకిస్ట్, ద్విట్ డైరెక్స్ లతో కేటీఆర్ సమావేశమై ఎలక్ట్రానిక్స్ కంపెనీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *