mt_logo

నిధులు విడుదల కాకుండానే అవినీతా?

మిషన్ కాకతీయకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకుండానే అవినీతి ఎట్లా జరుగుతుందో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో అవినీతి జరుగుతుందని వస్తున్న ఆరోపణలపై మంత్రి ఈరోజు స్పందిస్తూ మిషన్ కాకతీయను రాజకీయం చేయొద్దని, అవసరమైతే సలహాలు ఇవ్వండని, తప్పులు జరిగితే కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయమని సూచించారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు. 20 శాతం లెస్ చేయడంతో ప్రభుత్వానికి రూ. 500 కోట్లు ఆదా అయ్యిందని, రూ. 2 కోట్ల విలువైన మట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లారని, మిషన్ కాకతీయలో తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు.

ఇదిలాఉండగా మంత్రి హరీష్ రావు ఈరోజు ఉప్పల్ నల్ల చెరువుపై సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ రెండు దశల్లో నల్ల చెరువును అభివృద్ధి చేస్తామని, ప్లే గ్రౌండ్, పార్క్ లతో సుందరంగా చేస్తామని అన్నారు. నాచారం, హెచ్ఎంటీ, కాప్రా చెరువులతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *