mt_logo

DATA Welcomes Honorable Minister Sri K T Rama Rao

నూతన తెలంగాణ రాష్ట్ర IT మరియు పంచాయతి రాజ్ మంత్రివర్యులు శ్రీ కే తారక రామారావు గారికి, డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరుపున ఘన స్వాగతం పలికారు.

ఆరు దశాబ్దాల సుధీర్గ తెలంగాణ ప్రజల పోరాటం తర్వాత, తెలంగాణ ప్రజల కలలు సాకారమై స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తరువాత..శ్రీ KTR గారు, డల్లాస్ నగరానికి మొదటిసారిగా రావడం చాలా సంతోష పడవలసిన విషయం.

మనందరికీ తెలుసు..14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరియు ఆయన కుమారుడు KTR గారి పాత్ర, కృషి, స్ఫూర్తి ఎంతో వుంది.

తెలంగాణ ఉద్యమంలో KTR గారు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న అమెరికా జీవితాన్ని కూడా వదులుకొని, తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమంలో తండ్రికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, యువతకు బాసటగా నిలచాడు. తెలంగాణ ఏర్పడుతుందని గట్టి నమ్మకం లేని పరిస్తుతుల్లో కూడా, ధృడమైన విశ్వాసంతో, తన వెంట వున్న ప్రజలకు బలమైన విశ్వాసాని కలిగిస్తూ, తల వంచని సంకల్పంతో..యమ ప్రయాణంలో..KTR గారు ముందు వరసలో నిలచారు.

రాష్ట్ర మరియు జాతీయ వేదికలపై..మీడియా ప్రజా వేదికలపై, చర్చల్లో..తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పాడు. ఒక జాతికి తర తరాలుగా అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాన్ని విపులంగా తెలియచెప్పడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అనేది సామాన్య విషయం కాదు.

అలాంటి ప్రక్రియలో తండ్రి వెన్నంటే నిలిచి, తల్లి తండ్రులకు అన్ని విధాల బాసటగా నిలిచి..తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలచారు శ్రీ KTR గారు.

“Leadership is the capacity to translate vision into reality ”

“The quality of a leader is reflected in the standards they set for themselves ”

in a సింపుల్ word :

K – Keen: characterized by strength and distinctness of perception;

T – Tenacity: the quality of holding together firmly:

R – Righteousness: the quality of being just or rightful:

పైన చెప్పిన లక్షణాలన్నీ మనకు ఉద్యమ సమయంలో KTR లో కనిపించినవే!

తెలంగాణ సాదించగలము అనే ధృడమైన నమ్మకం..ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేసిన మన తరం గొప్ప నాయకుడు KTR గారు. ఒక్కక్క సారి నాయకుడు తను నమ్మిన సిద్ధాంతం కొరకు..తనను నమ్ముకున్న ప్రజల బాగు కొరకు..కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది..కఠినంగా ప్రవర్తించ వస్తుంది. చాలా మంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.

ఏ ఉద్యమమైన సరైన నాయకుడి కొరకు ఎదురుచూసే ప్రజలు చాలా ఉంటారు..కాని నాయకులు కొంత మందే ఉంటారు..అలాంటి బలమైన నాయకుడు..తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన నాయకుడు..శ్రీ KTR గారు.

బహుశ నాయకత్వ లక్షాణాలు..తండ్రి కేసీఆర్ సాంగత్యం నుంచి కొంత వచ్చినవి అయ్యుండొచ్చు..కొంత స్వయంకృషితో నేర్చుకున్నవి అయ్యుండొచ్చు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా..KTR గారు విశ్రమించలేదు..సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి దిశగ ముందుకు తీసుకెళ్ళడానికి..బంగారు తెలంగాణ నినాదంతో తన వంతు కృషిని ఇంకా చేస్తున్నారు..చాలా మంది రాజకీయ నాయకులు అధికారం తర్వాత..ప్రజల..ప్రాంత బాగోగులను పెద్దగ పట్టించుకోరు..కాని KTR గారు..చెదరని అదే సంకల్పం..అదే అంకిత భావంతో..తెలంగాణ ప్రజల అభివృద్ధికై శ్రమిస్తున్నారు.

బంగారు తెలంగాణ సాకారంలో..DATA తరుపున మా వంతు సహాయాన్ని పూర్తిగా అందిస్తామని..DATA సభ్యులు హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ కొరకు Sri KTR గారి ప్రయత్నం, సంకల్పం నెరవేరాలని DATA కోరుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *