mt_logo

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు – సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు అభివృద్ధి చేస్తామని, ఎంతటి తీవ్ర వ్యాధులకైనా హైదరాబాద్‌లో చికిత్స అందేలా వైద్యప్రమాణాలను పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి పనిచేయాలన్నారు.

సచివాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తో కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్లు టీ రఘునాథ్ రెడ్డి, ఎన్ గురురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలోని కొన్ని ఆస్పత్రులు అధునాతన వైద్యాన్ని అందిస్తున్నాయని, వీటిపై విస్తృత ప్రచారం చేయాలని వారికి సూచించారు.

హైదరాబాద్‌లోనే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, మాసాయిపేట వంటి దుర్ఘటనలు జరిగినప్పుడు జిల్లాలనుండి వచ్చే వారికి సమయం కలిసొస్తుందని సీఎం చెప్పారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కేర్ హాస్పిటల్ చైర్మన్ సోమరాజు 50లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *