mt_logo

పంటలకు నీళ్ళిచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు: కేటీఆర్

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాగానే వీర్నపల్లిని మండలంగా మార్చినం అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లెక్కబెడితే 420 వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ఇప్పుడే సీఎం కుర్చీలో కూర్చున్నా.. అప్పుడే ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నరు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు అని కేటీఆర్ అన్నారు.

జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు.. దొంగలే తిరుగుతారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.. పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు.. ఇప్పుడు కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు.. లెక్కలతో చెపుతున్న అని పేర్కొన్నారు.

ఒక టీఎంసీ వాటర్ అంటే హైదరాబాద్‌లో ఉన్న హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్ళతో సమానం. కేసీఆర్ ఉంటే ఏదో రకంగా నీళ్లు తెస్తుండే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ ఉంటే కాళేశ్వరం వీలైనంత తొందరగా రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇస్తుండే.. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల చనిపొకముందే దమ్ము ఉంటే నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి అని సూచించారు.

కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని రైతబంధు పడుతుండే.. మోసపోతే గోసపడుతారు అని కేసీఆర్ ముందే చెప్పిండు. బండి సంజయ్‌కి బుద్ది చెప్పాలంటే నాకంటే వినోద్ కుమార్‌కు ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. నా మీద కోపంతో కొద్ది మెజార్టీ తగ్గించారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఇవ్వాలి అని అన్నారు.

బండి సంజయ్ వీర్నపల్లికి ఒక్క రూపాయి అన్న తెచ్చిండా.. గంత మత్రానికి మనం బీజేపీకి ఓటు వేద్దామా.. పార్లమెంట్లో మాట్లాడాలంటే బండి సంజయ్‌కి హిందీ, ఇంగ్లీష్ రాదు ఎలా మాట్లాడుతారు. పార్లమెంట్లో బండి సంజయ్ హాజరు 5% శాతం మాత్రమే. బీజేపీ హిందూ దేవుళ్ళ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తుంది అని కేటీఆర్ తెలిపారు.

గతంలో వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నపుడు వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. గతాన్ని గుర్తు చేసుకొని వినోద్ కుమార్‌కు ఓట్లు వేసుకొని గెలిపించుకోవాలి అని అన్నారు.

రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు ఖచ్చితంగా అడగాలి.. ఎలక్షన్ కోడ్ రాకముందే రైతులకు ఇచ్చే బోనస్ పై జీవో తీసి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.

12వ తేదీన కరీంనగర్‌లో జరిగే కథన భేరికి భారీగా హాజరై విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.