mt_logo

ఏపీకి రూ. 18 కోట్ల సాయం అందించిన తెలంగాణ

హుదూద్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టం వాటిల్లిన ఏపీ ప్రభుత్వానికి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం తన దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాన్ తో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్లు పాడై, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 18 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను అందించింది. ఇటీవల కాశ్మీర్ కు వరదలు సంభవించిన సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించి రూ. 10 కోట్ల ఆర్ధిక సాయాన్ని, తాగునీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్టర్లను అందించిన విషయం తెలిసిందే.

ఏపీ అడిగిన సహాయం వెంటనే అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో 50 పెద్ద ట్రాన్స్ ఫార్మర్లు, 180 మీడియం ట్రాన్స్ ఫార్మర్లు, 300 చిన్న ట్రాన్స్ ఫార్మర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. వీటితోపాటు 28,500 విద్యుత్ స్తంభాలు, వాటికి అవసరమైన 100 కి.మీ, 300 కి.మీ, 500 కి.మీ దూరాలకు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా విద్యుత్ వైర్లను అందజేసినట్లు, ఇప్పటికే ఐదుగురు ఐఏఎస్ లను, మరికొంతమని సిబ్బందిని కూడా పంపించామని రాజీవ్ శర్మ చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తొమ్మిదిమంది డిప్యూటీ కలెక్టర్లను బుధవారం ఏపీకి పంపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *