mt_logo

తెలంగాణకు మెడ్‌ట్రానిక్స్ కంపెనీ భారీ పెట్టుబడి

న్యూయార్క్‌: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో  మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌ డివైజెస్‌ ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌ అయిన మెడ్‌ట్రానిక్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.  దాదాపు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లోమెడికల్‌ డివైజెస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. మెడ్‌ట్రానిక్స్‌ నిర్ణయంపట్ల ఆనందం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పెట్టుబడులలో ఒకదానిని స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉంది, మెడ్  ట్రానిక్ వారికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిజేశారు.