mt_logo

కేసీఆర్‌ని ఓడించే శక్తి మహాకూటమికి లేదు… నన్నపునేని సంచలన కామెంట్స్‌

తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రీ క్లయమాక్స్‌కు చేరుకుంది. ఇక మిగిలింది క్లయిమాక్సే.. మ్యాచ్‌కి ముందే రిజల్ట్‌ తేలిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంది సీన్‌. నాలుగు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని మహాకూటమిలా ఏర్పడినా టీఆర్‌ఎస్‌ని ఏమీ చేయలేరని తెలంగాణ సమాజం దాదాపు ఫిక్స్‌ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ప్రజలే కాదు, ఆ రెండు పార్టీల కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారనే పలువురు రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇది చాలు టీఆర్‌ఎస్‌ కారు జోరును, తెలంగాణను మరోసారి గులాబీమయం చేయడానికి రెడీ అవుతున్నాయని లెక్కలు కడుతున్నారు పరిశీలకులు.

మహాకూటమి ఎన్ని విషపు ఎత్తుగడలు వేసినా కేసీఆర్‌ను ఎదుర్కోలేదని వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులను ప్రకటించలేకపోయారని ఆయన సెటైర్ వేశారు. పేదింటి బిడ్డకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, తాను బతికున్నంతకాలం ఆయన నాయకత్వంలో పనిచేస్తానని, తన కుటుంబం కేసీఆర్‌కు రుణపడి ఉందని అన్నారు.

కేసీఆర్ ఒక్కరే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దగలరన్న విశ్వాసం ప్రజల్లోఉందన్నారు. నేటికీ 119 సీట్లు ఎంపిక చేయలేని మహాకూటమి.. నాలుగు కోట్ల ప్రజలను పాలించలేదనేది ప్రజల్లోకి బాగా వెళ్లిపోయిందని, కూటమిని కాలకూట విషంగా ప్రజలు భావిస్తున్నారని నన్నపునేని నరేందర్ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే, కూటమి నేతలు రోజురోజుకీ డల్‌ అవుతుండడం కనిపిస్తోందని ఓటర్లు చెప్పుకుంటుండడం హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *