ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్‌ఎస్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్ పార్టీ భవనం కేసీఆర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. నాలుగు అంతస్తులతో, 11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్ఎస్ భవన్ నిర్మించబడింది.లోయర్ గ్రౌండ్ లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ , రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లు నిర్మించారు.మొదటి అంతస్తులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 2,3 వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు, వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.