జేబిఎస్ లోనూ యూపీఐ సదుపాయం

  • October 27, 2021 3:22 pm

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా టిక్కెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా జేబీఎస్‌ లోనూ అదే తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు యూపీఐ లేదా క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించి రిజర్వేషన్‌ టికెట్లు తీసుకోవడంతో పాటు పార్శిల్, కార్గో సేవలను కూడా పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్‌ సేవలపై ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ప్రస్తుతం జేబీఎస్‌లో కూడా ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.


Connect with us

Videos

MORE