కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కసరత్తు ప్రారంభం అయింది. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కోరుతూ ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేయనుంది. ఇందుకోసం 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు వీలైనంత త్వరగా పంపించాలని ఆర్థిక శాఖ కోరింది. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిఎం కెసిఆర్ ప్రకటించారు. 11 వేలపైచిలుకు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సిఎం పేర్కొన్నారు.