mt_logo

తెలంగాణలో మిన్నంటిన సంబురాలు

తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ పది జిల్లాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ తెలంగాణ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు బొంతు రామ్మోహన్, గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి 1969 ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన 25 మందిని సత్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులంతా ఆర్ట్స్ కళాశాల ముందుకు వచ్చి పటాసులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. నృత్యాలు చేస్తూ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఈనెల 25 న అమరవీరుల కుటుంబాలతో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భారీ విజయోత్సవ సభను నిర్వహించనున్నామని ఓయూ జేఏసీ నాయకులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *