లోక్ సభ సాక్షిగా సమైక్య బూతులు

  • October 1, 2013 2:11 pm

సెప్టెంబర్ 2 నాడు లోక్ సభలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు పెద్ద రచ్చ చేశారు. ఆ సందర్భంగా వారు వాడిన భాషపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే సందీప్ దీక్షిత్ తమని బెదిరించాడని తెలుగుదేశం ఎంపీలు బీజేపీ నాయకులను వెంటేసుకుని స్పీకర్ మీరాకుమార్ కు ఉల్టా ఫిర్యాదు చేశారు. సందీప్ దీక్షిత్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యులు సభలో చాలా అనుచితమైన భాషను వాడారని అందుకే వారిపైన తాను ఆగ్రహం వ్యక్తంచేశానని వివరణ ఇచ్చిండు.

మరునాడు చంద్రబాబు సీమాంధ్రలో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కొరకు లోక్ సభలో పోరాడుతున్న తమ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలు బెదిరిస్తున్నారని తెగ బాధపడ్డాడు. దానికి ఇక్కడి సీమాంధ్ర మీడియా బాగా ప్రచారం ఇచ్చింది.

అయితే ఆరోజు లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు వాడిన భాష ఎట్లా ఉందో ఏ మీడియా ఇప్పటివరకూ చెప్పలేదు.

ఆరోజు లోక్ సభలో తెదేపా ఎంపీలు ఏం మాట్లాడిండ్రో లోక్ సభ రికార్డుల నుండి మిషన్ తెలంగాణ సంపాదించింది.

ఒకసారే మీరే ఆ సమైక్య బూతులను చదివి తరించండి. ఇంతటి భాషాపటిమ, మర్యాద ఉన్నవాళ్లను ఎంపీలుగా లోక్ సభకు పంపించి తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంత గొప్ప పార్టీనో కదా!

తెలంగాణ ఉద్యమ నాయకుల ప్రతిమాటను ఎక్స్-రే కిందపెట్టి చర్చలు జరిపే సీమాంధ్ర మీడియా ఇంత మంచి “సమైక్య” తెలుగు భాషను ఎందుకు పట్టించుకోలేదన్నది ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్న.


Connect with us

Videos

MORE