
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్) ను కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.


