mt_logo

ఓటుకు దూరంగా రైల్వే, ఆర్టీసీ ఉద్యోగులు!

ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రతీరోజూ ఎన్నికల కమిషన్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఓటు వేస్తామని అడిగినా తగిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రభుత్వం ఆర్టీసీ, రైల్వే ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి చూపుతుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వీరంతా సరిగా ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నారు. రైల్వే శాఖలో పనిచేసే డ్రైవర్స్, గార్డ్స్, ఏసీ మెకానిక్ లు, ఏసీ అటెండెంట్స్, గ్యాంగ్ మెన్ తదితరులు ఓటింగ్ లో పాల్గొనలేకపోతున్నారు. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు విధినిర్వహణలో దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ కారణంగా వారంతా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండాపోతుంది. లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా రోజూ దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తున్నందున వీరుకూడా ఓటు వేయని పరిస్థితి కలుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ విధానం లేదా వేరే పద్ధతి ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వీరంతా చాలా ఏళ్లనుండి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఎన్నికల రోజు ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కోరినా అది సాధ్యంకాదు కాబట్టి ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు. ఆర్టీసీ కార్మికులందరూ ఎన్నికల్లో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్నికలు జరిగే రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామరెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం నాయకుడు సుబ్రహ్మణ్యం కూడా రైల్వే ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *