ఫోటో రైటప్: 01&02.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల వివరాలు తెలిపే ఇన్ఫో కార్డ్సు.
3. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు అందించే సర్వీసు ప్రొవైడర్ల వివరాలు.
– రాష్ట్రమంతటా విస్తరించిన టీ-సాట్ నెట్వర్క్ ప్రసారాలు
– 43 కేబుల్ నెట్వర్క్ కేంద్రాల నుండి అందుబాటులో
– ఎయిర్‌టెల్ డీటీహెచ్ 948, 949లోనూ చూడవచ్చు
– నిరంతర ప్రసారాల వేదికగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.
సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి
(టీ-సాట్-సాఫ్ట్ నెట్)
టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు తెలంగాణ లోని ప్రతి పల్లెకూ విస్తరించాయి. సోషల్ మీడియా ద్వారా ప్రతి మొబైల్ ఫోన్ లోనూ అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ నెట్వర్క్ లో మొదటి నుండే ప్రసారాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే డీటీహెచ్, బ్రాడ్ బాండ్ నెట్వర్క్ ప్రసారాల్లో మూడవ స్థానంలో ఉన్న దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ కూడా ప్రసారాలు అందిస్తోంది.
సేవే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోన్న టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు తెలంగాణలోని ప్రతి పల్లెకూ విస్తరించాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆర్వోటీ, కేబుల్, డీటీహెచ్, సోషల్ మీడియా ద్వార ఛానళ్లు విద్యార్థి, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచనల మేరకు తెలంగాణలోని 43 మంది కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లు టీ-సాట్ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలు అందిస్తున్నారని వివరించారు. ఏయిర్ టెల్ డీటీహెచ్ లో విద్య-948, నిపుణ-949 నెంబర్లలో ప్రసారం చేస్తున్నాయని, అడవి ప్రాంతాల్లో ఉన్న గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు డీటీహెచ్ ఆర్వోటీల ద్వార టీ-సాట్ సేవలు పొందుతున్నారన్నారు. -సాట్ యూట్యూబ్, యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రసారాలు అందిస్తూ ఆన్ లైన్ విద్యా బోధన అందిస్తున్న ఛానళ్లలో టీ-సాట్ నెట్వర్క్ దేశంలో రెండవ స్థానంలో కొనసాగుతోందని శైలేష్ రెడ్డి ప్రకటించారు.
కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి
తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ విద్యను టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార విద్యార్థులకు అందిస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలు చేయని పక్షంలో స్థానిక అధికారులకు లేదా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని సీఈవో శైలేష్ రెడ్డి సూచించారు. కేబుల్ ఆపరేటర్లు ప్రసారాల్లో నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులు, విద్యా కమిటీ ఛైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. డీటీహెచ్ ద్వారా ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్రసారాలు అందిస్తుండగా మిగతా డీటీహెచ్ సంస్థలు ప్రసారాలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
సెప్టెంబర్ ఒకటి నుండి ఆన్ లైన్ బోధన
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆన్ లైన్ బోధన ప్రసారాల కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమౌతుందని సీఈవో ప్రకటించారు. మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు వారికి కేటాయించిన సమయాల్లో పాఠ్యాంశాలు ప్రసారమౌతాయని, కరోనా సందర్భంగా విద్యార్థులు ఆ పాఠ్యాంశాలు వినియోగించుకునేలా వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.