mt_logo

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

మహబూబాబాద్, మే24 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యం ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేక‌రించాల‌ని, తేమ పేరుతో రైతుల‌ను ఇబ్బందుకు గురిచేయొద్దని అధికారుల‌ను ఆదేశించారు. త‌డిసిన ధాన్యాన్ని కూడా సేక‌రిస్తామ‌ని, రైతులు ఆదోళ‌న చెందవద్దని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా క‌ల్పించారు.