mt_logo

పింగళి వెంకయ్య మనకెంతో గర్వకారణం : మంత్రి కేటీఆర్

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. 75 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశం సగర్వంగా ఎగురవేస్తున్న త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు అయిన పింగళి వెంకయ్య మన తెలుగు బిడ్డ అవడం గర్వకారణం అని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. కాగా పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. మహాత్మ గాంధీ సూచనల మేరకు మధ్యంలో రాట్నం గుర్తును తీసుకవచ్చారు. అనంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో ఆశోక చక్రాన్ని తీసుకవచ్చారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించడంతో పాటు గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *