కోజికోడ్ కు చెందిన ఆరేళ్ల చిన్నారి టాలెంట్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల పాప, మూడేళ్ళ తన తమ్ముడికి తండ్రి క్రికెట్ నేర్పిస్తుండటం చూసి, ‘నేను అమ్మాయిని కాబట్టే నాకు నేర్పించడం లేదా నాన్నా?’ అంటూ తండ్రిని నిలదీసింది. ఆ మాటలతో తన పొరపాటు అర్థం చేసుకున్న ఆ తండ్రి ఫాతిమాకి క్రికెట్ పాఠాలు నేర్పించగా, ఇపుడు ఆ పాపకి ఎదురు లేకుండా పోయింది. చేతిలో బ్యాటుతో కచ్చితమైన ఫుట్‌వర్క్, పూర్తి బ్యాలెన్స్‌తో ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కవర్ డ్రైవ్‌లు స్ట్రెయిట్ షాట్లు, ఫ్లిక్, డిఫెన్స్, పుల్ షాట్.. ఇలా క్రికెట్ బుక్‌లో ఉన్న షాట్లన్నీ ఆడుతోంది. దీంతో ఆమె టెక్నిక్‌కు కేటీఆర్ అబ్బురపడ్డారు. దీంతో ఫాతిమా టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.