mt_logo

భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై ఆరా తీశారు. సిరిసిల్ల కలక్టరేట్ లో జరిగిన ఈ సమీక్షలో zpp చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్,ఎస్పీ మున్సిపల్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల వారితో కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ‘ప్రాథమిక సమాచారం ప్రకారం జూలైలో సాధారణం కంటే 450 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని, అయినా అలక్ష్యంగా ఉండొద్దని, ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలన్నారు. చెరువులు, ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకి, పోలీస్ రెవెన్యూ వంటి ఇతర శాఖలో ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని, నీటి విడుదల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాలలో ఖచ్చితమైన సేఫ్టీ అడిట్ జరగాలని, పట్టణాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాలని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాత నిర్మాణాలను వెంటనే తొలగించాలని, నిరుపయోగంగా ఉన్న బోరుబావులతో పాటు నీటి బాగులను వెంటనే పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *