mt_logo

ఐటీ రంగంలో అంచనాలకు మించి అభివృద్ధి : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్రం ఐటీలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, అనుకున్న దానికంటే ఎక్కువే విజయం సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *