రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని పారిశ్రామికవాడలో సెల్ కాన్ మొబైల్ తయారీ కంపెనీని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెల్ కాన్ కంపెనీని రాష్ట్రంలో ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ఇప్పుడు సెల్ కాన్ వచ్చింది. రేపు మైక్రో మ్యాక్స్ కంపెనీ రాబోతోంది. సెల్ కాన్ కంపెనీని మరింత విస్తరించాలని కేటీఆర్ వారికి సూచించారు.
భారతదేశంలో 100 కోట్ల మొబైల్స్ తయారు చేస్తున్నారని, కంపెనీలు మాత్రం తక్కువ ఉన్నాయని, మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ తెలంగాణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.