mt_logo

వచ్చే ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం: కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్‌ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. 

ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం

రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీల ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నడు. రాహుల్‌గాంధీని ఉత్త పప్పు కాదు, ముద్దపప్పు అన్నడని గుర్తు చేసారు.  ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీల జొచ్చిండు,  కాంగ్రెస్‌లోకి వచ్చినంక బలిదేవత సోనియాగాంధీ రేవంత్‌రెడ్డికి కాలికామాత లెక్క కనపడ్తున్నది.  ముద్ద పప్పు రాహుల్‌గాంధీ నిప్పు లెక్క కనపడ్తున్నడు. ఇదిట్టుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య పోరాటం అని రాహుల్‌గాంధీ అంటున్నడని మండిపడ్డారు.  రాహుల్‌గాంధీ చెప్పింది నిజమే. ఇక్కడ ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం జరుగుతున్నది అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఉద్యమంపై అడుగడుగునా నీళ్లు పోసింది ఇందిరాగాంధీనే

రాహుల్‌గాంధీ లీడర్‌ కాదు, రీడర్‌. ఏదీ రాసిస్తే అది సదువుతడు, పోతడు,  ఆయనకు తెలియని విషయం ఏందంటే ఢిల్లీ దొరలతో పోరాటం తెలంగాణ ప్రజలకు కొత్త కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 ఏళ్లు తెలంగాణ ప్రజలు ఢిల్లీతో పోరాడిండ్రు.  రగులుతున్న తెలంగాణ ఉద్యమంపై అడుగడుగునా నీళ్లు పోసింది రాహుల్‌గాంధీ నాయినమ్మ ఇందిరాగాంధీనే. దేశంలో ఎమర్జెన్సీ విధించిన నియంత కూడా రాహుల్‌గాంధీ నాయనమ్మనే. తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మందిని బలితీసుకున్నది రాహుల్‌గాంధీ తల్లి సోనియమ్మ. నాడు రాహుల్‌గాంధీ ముత్తాత జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలు ఇప్పుడు నరేంద్రమోదీ వరకు సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలు ఢిల్లీ దొరల మీద కొట్లాడుతనే ఉన్నరు అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.