ఫ్రాన్స్ బయల్దేరిన కేటీఆర్.. ఫ్రెంచ్ సెనేట్‌లో కీలకోపన్యాసం

  • October 27, 2021 12:29 pm

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ బృందం బుధ‌వారం ఉద‌యం ఫ్రాన్స్‌కు బ‌య‌ల్దేరింది. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. దీంతోపాటు పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కేటీఆర్‌తో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజ‌న్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


Connect with us

Videos

MORE