mt_logo

“ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనం టీఆర్ఎస్” : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం మరి కాసేపట్లో మొదలవబోతోంతుండగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. పలువురు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంతో మంత్రితో సెల్ఫీలు తీసుకోడానికి ఆసక్తి చూపగా.. మంత్రి కేటీఆర్ వారితో సెల్ఫీలు దిగి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ 20 ఏళ్ల అభివృద్ధి సంబరాలను గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్..
“ఈ మట్టి కోసమే పుట్టి
గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి
20 ఏండ్ల పండుగ!

స్వీయ రాజకీయ అస్తిత్వ
పతాకానికి దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక!

తెలంగాణ గళం ..బలం.. అగ్రగామి దళం
TRS!

జలదృశ్యం నుండి
సుజల సుఫల దృశ్యాల దాకా
ప్రపంచం చూడని.. మహోన్నత
పరివర్తనా ప్రస్థానం!” అంటూ తన ట్విట్టర్లో ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.

కాగా ప్లీనరీ సమావేశాల సందర్బంగా హైదరాబాద్ నగర రోడ్లు గులాబీ మయంగా మారాయి. టీఆర్ఎస్ ప్రతినిధులు హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం వరకు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *