mt_logo

ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ: కేటీఆర్

కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు మన కాళన్న అని కొనియాడారు

కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణ రావు అని పేర్కొన్నారు.

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ గారు తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు అని గుర్తు చేశారు.

స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ గారు అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయం అని కేటీఆర్ అన్నారు.