తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖర్ రావు జూన్ రెండున ఉదయం 8గంటల 15నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. అదేరోజు మధ్యాహ్నం గం12.57ని.లకు సమతా బ్లాకులోని సీఎం చాంబర్‌కు చేరుకుని కొన్ని కీలక ఫైళ్ళపై సంతకాలు చేయనున్నారు.
అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేసే ఫైలుపై మొదటి సంతకం, రైతులు తీసుకున్న లక్షలోపు వ్యవసాయ ఋణ మాఫీ ఫైలుపై రెండవ సంతకం చేయనున్నారని సమాచారం. వీటితో పాటు మరో 8 కీలకఫైళ్ళపై కేసీఆర్ సంతకాలు చేయనున్నారని తెలిసింది.