రైతులు అరికకట్టాలన్నా.. దుక్కి దున్ని.. నాట్లు వేయాలన్నా వరుణుడు కరుణించాల్సిందే. పచ్చని పంట పండాలంటే సకాలంలో వర్షాలు కురవాల్సిందే. సమైక్య పాలనలో ప్రతి ఏటా అన్నదాత వర్షాల కోసం మొగులు ముఖం చూసేవాడు. వర్షాలు పడితేనే పంట పండేది. లేకుంటే ఆ ఏడాదంతా పంటేకాదు.. అన్నదాత కుటుంబం ఎండుడే. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ దుస్థితికి చెక్ పెట్టారు. తన విజన్‌తో వర్షాలు పడకున్నా అన్నదాతలు వర్షంకోసం ఆకాశంవైపు చూడకుండా చేశారు. భారీ రిజర్వాయర్ల నిర్మాణం, మిషన్‌కాకతీయ, చెక్‌డ్యాములు, ప్రాజెక్టులకు చెరువుల అనుసంధానం, హరితహారం కార్యక్రమంతో తెలంగాణ గడ్డపై నిత్యం జలసవ్వడులు వినిపించేలా చేశారు. వర్షం చుక్కపడకున్నా చివరి మడికీ తడి అందేలా చూశారు. నాడు బీడుబడ్డ తెలంగాణ పొలాలను.. నేడు పచ్చని మాగాణంలా మార్చేశారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ అన్నదాత ఆనందాల సాగు చేసేలా కేసీఆర్ సాగు*మంత్రం* వేశారు.
ఫలించిన కేసీఆర్ 5 మంత్ర
1. తెలంగాణ సిద్ధించగానే సీఎం కేసీఆర్ మొదట వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. కాకతీయుల స్ఫూర్తితో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. ఇందుకోసం మిషన్ కాకతీయ అనే పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 46,500 చెరువులను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ నాలుగు దశల్లో ఈ పథకం పూర్తికాగా, 21,436 చెరువుల్లో పూడికతీయడంతో పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. వీటికింత తూములు నిర్మించి, రైతుల పొలాల్లోకి జలాన్ని పారించారు. ఈ చెరువుల కింద మొత్తంగా 15లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, వ్యవసాయాన్ని పండుగ చేశారు.
2. అక్కడితో వదిలేయకుండా ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించడంతో.. ఊరచెరువులన్నీ ఎండాకాలంలోనూ నీటితో తడలుకొడుతున్నాయి.
3. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి, అవసరమున్న చోటల్లా జలాశయాలు నిర్మించారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని భారీ బాహుబలి మోటర్లరతో ఇందులో నింపి.. రైతుల పొలాలకు మళ్లించారు.
4.వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రాష్ట్రంలోని అన్ని వాగులపై 1200 చెక్‌డ్యాంలను నిర్మించారు. ఇటీలవల మరో 285 చెక్‌డ్యాంలను మంజూరు చేసి, చకచకా పనులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ చెక్‌డ్యాంలతో తెలంగాణలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2014-2023 వరకు తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 4.34 మీటర్లకు పెరిగింది.
5.ఇక తెలంగాణకు హరితహారంతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పరుచుకున్నది. ఫలితంగా వాతావరణంలో తేమశాతం పెరిగిపోయింది. సహజ జీవావరణ వ్యవస్థకు ఇది దోహదపడింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, చెట్లయ్యాయి. ఫలితంగా వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయి. వీటన్నింటికీ 24 గంటల ఉచిత కరెంటు తోడవ్వడంతో అనతికాలంలోనే తెలంగాణ పచ్చని పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరడంతో.. తెలంగాణలోని అన్నదాత పంటపంటకూ ఆనందాల సాగు చేస్తున్నాడు. పసడి పంటలు పండిస్తూ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నాడు.