mt_logo

కదన కవాతు చేసిన తెలంగాణ

సెప్టెంబర్ 30న ప్రళయ భీకరమైన రీతిలో హైదరాబాద్ వీధుల్లో జరగనున్న తెలంగాణ మార్చ్ కు సన్నాహకంగా కరీంనగర్ లో నిర్వహించిన మార్చ్ విజయవంతమైది. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన తెలంగాణావాదులతో కరీంనగర్ వీధులు హోరెత్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సి.పి,ఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ మార్చ్ కు మద్ధతుగా నిలిచాయి.

“జై తెలంగాణ” అనే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లేలా తెలంగాణా ప్రజానీకం గర్జించింది. పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ ఒక్కటై కలిసివచ్చిన ఈ అపురూప దృశ్యం, తెలంగాణలోని సబ్బండవర్ణాలు కలిసి చేసిన తెలంగాణ నినాదం తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీలో నూతనోత్సాహం నింపింది.

“ఇంటికో మనిషి, చేతికో జెండా” అనే నినాదంతో 30 నాడు హైదరాబాద్ తరలి రావాలని, డిల్లీ గుండెలు ఝల్లుమనేలా ఉద్యమశంఖారావం మోగించాలని కరీంనగర్ మార్చ్ కు హాజరైన నేతలు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *