సిర్పూర్ లో భారీ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో స్థానిక నాగమ్మ చెరువులో భారీ బుద్ధుడి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సొంత ఖర్చులతో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విగ్రహాన్ని ఏపీలోని కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో ప్రత్యేక నిపుణుడి పర్యవేక్షణలో తయారు చేయించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ దండె విఠల్, బౌద్ధ భిక్షువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.