భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అయితే ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న అన్ని మ్యూజియంలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వదేశీయులతో పాటు విదేశీయుల నుంచి ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేశారు. గోల్కొండ, చార్మినార్‌తో పాటు ఇతర సందర్శన ప్రదేశాలను పర్యాటకులు ఉచితంగా చూడొచ్చని అధికారులు వెల్లడించారు.
