నల్గొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రైతులు నల్లజెండాలతో నిరసనలు తెలియజేసారు. నల్గొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద రైతులు, స్థానిక కార్యకర్తలు బండి సంజయ్ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ రైతులు సంజయ్ ను అడ్డుకొని, గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేయడంతో బండి సంజయ్ కు రైతులకు వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో నల్గొండలో పోలీసులు భారీగా మోహరించారు.

