సీమాంధ ఆందోళనలకు సీమాంధ్ర మీడియా ఇచ్చే వెన్నుదన్ను అంతా ఇంతాకాదు. గత రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న అరాచకత్వానికి సీమాంధ్ర మీడియానే కర్త, క్రియ, కర్మ.
నిన్న విజయనగరంలో “సమైక్యాంధ్ర” ముసుగులో బొత్స సత్యనారాయణ వ్యతిరేకులు ఆయన ఇల్లు, వ్యాపారాలు లక్ష్యంగా చెలరేగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్ల దాడి జరిపిన అల్లరిమూకల ఫొటో వేసింది ఇవ్వాళ ఈనాడు విజయనగరం ఎడిషన్. అయితే ఆ వ్యక్తుల ముఖాలు కనపడకుండా బ్లర్ చేసి ఆ ఫొటోలు వేసింది. పోలీసులు ఆ యువకులపై కేసులు పెట్టకుండా ఇది ఈనాడు అందించే సహకారం అన్నమాట.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మాత్రం పోలీసులకు ఫొటోలు, వీడియోలు అందించి కేసులు పెట్టడానికి ఉపకరించిన సీమాంధ్ర మీడియా, “తమవారి” దగ్గరికొచ్చేసరికి ఎట్లా కాపాడుకుంటోందా తెలిసిందా?
ఇదీ ఈనాడు దినపత్రిక ద్వంద్వ నీతి. ఇంకా మనమా పత్రికను చదువుదామా? మాతృభూమికి ద్రోహం చేద్దామా? అలోచించండి.