వాసాలమర్రిలో దళితబంధు యూనిట్ల పంపిణీ

  • October 27, 2021 12:59 pm

సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత క‌లిసి ద‌ళితబంధు ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు యూనిట్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుతో వాసాల‌మ‌ర్రి గ్రామ ద‌ళితులు ఆర్థికంగా ఎదుగుతార‌ని తెలియజేశారు. వాసాలమర్రి గ్రామ ద‌ళితులు ఆర్థికంగా విజ‌యం సాధించి దేశానికి ఆద‌ర్శంగా నిలిచి, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. ఇవాళ తెలంగాణ సంక్షేమ ప‌థ‌కాల గురించి దేశ‌మంతా మాట్లాడుకుంటున్నార‌ని, ముఖ్యంగా దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని కొనియాడారు. గొప్ప గొప్ప కలలు కని వాటిని సాకారం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్ర‌మే అని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ శ్యాంసుంద‌ర్ తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE