వరంగల్లో జరిగిన కంటి ఆపరేషన్లు “కంటి వెలుగు” కార్యక్రమంలో జరిగినవి కావు. ఈ ఆపరేషన్లు జాతీయ అంధత్వ నివారణ పథకం కింద చేయడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే, కంటి వెలుగు కార్యక్రమం కింద ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్లు చేయడం జరగలేదు.. “కంటి వెలుగు” కార్యక్రామానికి సంబంధం లేకపోయినప్పటికీ భాదితులకు ఎల్. వీ. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.
ఈ విషయం పట్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి స్పందించారు. వరంగల్ జిల్లాలో జరిగిన కంటి ఆపరేషన్లకు, “కంటి వెలుగు” పథకంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వరంగల్ ఘటనపై విచారణ కమిటీ వేశామని శాంతి కుమారి తెలిపారు.