mt_logo

జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలు రద్దు : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… వీటి నియంత్రణలో భాగంగా జనవరి 2వ తేదీ వరకు అన్ని ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాలపట్ల ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి వెయ్యు రూపాయల ఫైన్ విధించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *