ఆక్వాస్క్రీన్‌ లేజర్ షోలో మెరిసిన కేసీఆర్ చిత్రం

  • October 14, 2021 3:24 pm

సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద బుధవారం ఆక్వాస్క్రీన్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ కనువిందు చేసింది. గుజరాత్‌లోని వడోదరలో నర్మదా నదిపై మొదటి ఆక్వాస్క్రీన్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఉండగా.. రెండోది సిద్దిపేటలో బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. మ్యూజిక్‌కు అనుగుణంగా ఫౌంటెయిన్‌లో జలాలు విరజిమ్ముతాయి. బుధవారం నిర్వహించిన ఈ షోలో లేజర్‌ కిరణాలతో ఏర్పడిన సీఎం కేసీఆర్‌ చిత్రం విశేషంగా ఆకట్టుకున్నది. కేసీఆర్ చిత్రంతో పాటు బతుకమ్మ, హరీష్ రావు, చిత్రాలు లేజర్ షోలో ప్రదర్శితమయ్యాయి. ఈ సందర్బంగా కోమటి చెరువుకు సందర్శుకులు పోటెత్తారు. పలువురు సందర్శుకులతో హరీష్ రావు ముచ్చటిస్తూ సందడి చేశారు.


Connect with us

Videos

MORE