mt_logo

అన్నారం బ్యారేజ్‌కి ఎలాంటి సమస్య లేదు: యాదగిరి, అన్నారం బ్యారేజి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అన్నారం బ్యారేజ్‌పై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని యాదగిరి, నీటి పారుదల శాఖ ఈఈ (సరస్వతి బరాజ్‌), తెలిపారు. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అన్నారం బ్యారేజ్‌కు ఢోకా లేదన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి సంవత్సరం సహజంగా ఆపరేషన్ మైంటేనెన్స్ చేస్తాం.

 1275 మీటర్స్ లెంగ్త్‌లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదు. ఇరిగేషన్ శాఖ మరియు ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత వాళ్లదే. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నాం. 

సాండ్‌తోని రింగ్ బండ్ కూడా వేస్తున్నాం. ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుందని . ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ అలో చేసేందుకు డిజై న్‌లోనే ఆరెంజ్మెంట్ ఉంటుంది. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తామని యాదగిరి, ఎగ్జిక్యూటివ్  అన్నారం బ్యారేజీ  ఇంజనీర్ పేర్కొన్నారు.