తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నడుస్తున్న ఆందోళనలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తాజాగా అలిపిరి వద్ద వీహెచ్ కారుపై ఈ ఉదయం జరిగిన దాడి సమైక్య వాదనలోని డొల్లతనాన్ని మరోసారి నిరూపించింది.
తిరుపతికి స్వామి దర్శనం కొరకు కుటుంబసమేతంగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు వీహెచ్ కొండదిగి వస్తుండగా అలిపిరి వద్ద కాపుకాసిన సీమాంధ్ర ఆందోళనకారులు ఆయన కారుమీద విరుచుకుపడ్డారు. కారు మీదికి చెప్పులు, రాళ్లు విసిరారు.
వీహెచ్ పై జరిగిన దాడిని టీఆరెస్ నేత హరీశ్ రావు, జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ పైకి చెప్తున్నవారు సీమాంధ్రలో తెలంగాణావాదుల మీద దాడి చేయడం ద్వారా తెలంగాణ ప్రజలను ఇంకొంచెం దూరం చేసుకుంటున్నారని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.
—
ఫొటో: అలిపిరి వద్ద రవాణ సౌకర్యాలు లేక భక్తుల కొట్లాట
ఫొటో: అలిపిరి తోపులాటలో గాయపడ్డ భక్తురాలు
—
ఇక గత కొన్నిరోజులుగా తిరుమల కొండమీదకు ఆర్టీసీ బస్సులు ఆపివేయడంతో ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవ్వాళ ఉదయం అలిపిరి వద్ద బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆపివేయడంతో ప్రయాణీకులు ఒకరితో ఒకరు గొడవపడి రక్తాలు కారేలా కొట్టుకున్నారు.