మలేషియాలో ఘనంగా ఉగాది సంబురాలు

  • April 24, 2017 10:43 am

తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (TAM) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలేషియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అహమ్మద్ జహీద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యాక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ TAM ప్రెసిడెంట్ Dr. అచ్చయ్య కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తన వంతు సహకారాన్ని అందజేసినందుకు గాను తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ Dr. అచ్చయ్య కుమార్ గారు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతిని మరియు వైస్ ప్రెసిడెంట్ సత్య ను శాలువాతో సత్కరించారు.


Connect with us

Videos

MORE