mt_logo

త్వరలో దేశంలోనే అతిపెద్ద భూగర్భగని

తెలంగాణ సిరులగని సింగరేణి సంస్థ మరో రికార్డు సృష్టించబోతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గనిని వచ్చే నెలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నద్ధమవుతోంది. ఏటా 2.8 మిలియన్ టన్నుల సామర్ధ్యమున్న భూగర్భ గనిని మొదలు పెట్టనుంది. దీని ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 10 నుండి 15 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్ధ్యం తమ సంస్థకు ఉందని సింగరేణి చైర్మన్ సుతీర్థ భట్టాచార్య తెలిపారు. ఈ సంవత్సరం సంస్థ లక్ష్యం 54.5 మిలియన్ టన్నులని, మార్చి 31, 2015 తో పూర్తయ్యే ఆర్ధిక సంవత్సరంలో 55 మిలియన్ టన్నులు, ఆ తర్వాతి ఏడాది మరో 56 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని వివరించారు.

కోల్ ఇండియా సంస్థ ఉత్పత్తి తగ్గిపోతుండటంతో దేశంలో చాలా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశ అవసరాల్లో 80 శాతం ఉత్పత్తి చేసే కోల్ ఇండియా అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నది. అయితే భూగర్భ బొగ్గుగనికి సంబంధించి అడ్రియాలా షాఫ్ట్ ను కరీంనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా నడిపి చూశామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *