తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

  • March 11, 2019 3:45 pm

టీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో ఈరోజు ప్రారంభమైంది. మంగళవారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్ధులు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాజరయ్యారు.


Connect with us

Videos

MORE