mt_logo

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ యు.కే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ యు.కే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్‌ పార్టి 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ లండన్ ఇంచార్జ్ రత్నాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో, యు.కే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరై కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ లండన్ ఇంచార్జ్ రత్నాకర్ గారు మాట్లాడుతూ 2001 నుండి తెరాస పార్టీ స్వరాష్ట్ర సాధనలో చేసిన ఉద్యమాలను సభకు గుర్తు చేసారు. అదేవిదంగా స్వరాష్ట్రం కోసం ఉద్యమంలోనే కాకుండా ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అవకాశం కల్పించినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి అశోక్ దుసరి గారు మాట్లాడుతూ ఎంతో బిజీగా ఉన్నపటికీ కార్యక్రమానికి వచ్చినందుకు తెరాస కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలిపారు.

తెరాస ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పధకాలు మరియు అభివృద్ధి పనులు గురించి సభకు వివరించారు. రానున్న పాలేరు ఉప-ఎన్నికలలో తెరాస పార్టీకి ఓటు వేసి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని భారి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ కార్యదర్శి వెంకట్ రెడ్డి దొంతుల మాట్లాడుతూ, ఖమ్మంలో ఇటీవల జరిగిన తెరాస ప్లేనరికి లండన్ నుండి ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచలం గారు, కార్యదర్శి నవీన్ రెడ్డి అలాగే ఆస్ట్రేలియా నుండి అనిల్ బైరెడ్డి, నాగేందర్ రెడ్డి గారు వెళ్లి ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం జరిగింది. అయితే, మన ముఖ్య మంత్రి కేసీఆర్ గారు వారిని వేదిక పైకి పిలిచి ప్రత్యేకించి అభినందించడం మాకెంతో స్ఫూర్తినిచ్చిందని, ఇలాంటి గొప్ప నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని, మరింత బాధ్యతతో పని చేస్తామని తెలిపారు.

యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి రేకుల మాట్లాడుతూ, ఇటీవల ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీన్మారలని సభకు వివరించి, హర్షద్వానలతో వాటిని ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ సంపూర్ణంగా ఆమోదించినట్టి తెలిపారు.

కార్యక్రమంలో ప్రదాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి వెంకట్ రెడ్డి దొంతుల, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి రేకుల, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిథి శ్రీకాంత్ జెల్ల, సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, మెంబెర్షిప్ ఇన్‌ఛార్జ్ సతీష్ రెడ్డి, వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ మధు సుధన్ రెడ్డి, రాజేష్ వర్మ ముక్య నాయకులూ సృజన రెడ్డి చాడ, సత్య, శ్రీకాంత్, హరిదీప్, గణేష్, శ్రీధర్ హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *