సౌతాఫ్రికాలో ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు..

  • March 14, 2019 2:30 pm

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఎంపీ కవిత బర్త్ డే సందర్భంగా అవయవ దాన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖలోని సభ్యులంతా అవయవ దానం చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా సభ్యులంతా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గుర్రాల, నన్నూరి మల్లికార్జున్ రెడ్డి, నరేందర్ రెడ్డి మాదసాని, హరీష్ రంగ, వంశీ వూరు, సుఖేష్ అలుగురి, నమ రాజేష్, సాయికిరణ్ నల్లా, విష్ణు గుండా జై, అరవింద్ ప్రసాద్ చికోటి, శ్రీనివాస్ రేపాల, దీపికా జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE