mt_logo

ద గ్రేట్ వాటర్ రష్!

By: టంకశాల అశోక్

కోయిల్ సాగర్‌తో జల కోలాహలం

రాష్ట్రంలో ఒక వైపు తగినంతగా వర్షాలు కురిసి, కొత్త ప్రాజెక్టులు సాకారం కావడం మొదలవుతున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌సాగర్ కింద చెరువులు నిండు గర్భిణులై రైతుల ఆశలు ఫలిస్తున్నాయి. దీనిపై సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ అందిస్తున్న ప్రత్యక్ష ప్రజాభిప్రాయ సేకరణ వ్యాస పరంపరలో మొదటిది.

ఆ సీనియర్ ఇంజినీర్‌కు ఇటు ఎదురుగా ఉన్న మను షులతో మాట్లాడాలో లేక సెల్‌ఫోన్లకు సమాధాన మివ్వాలో తెలియక సతమతం కావటంతోనే సరి పోయింది రోజంతా. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ సాగర్ ఎత్తి పోతల పథకం కింద నీళ్లందుతున్న ఆయకట్టు గ్రామా లలో అక్టోబర్ చివరి వారంలో పర్యటిస్తుండగా, తమ చెరువు ను నింపాలంటే తమ చెరువని కోరుతూ వరుసగా ఫోన్లు ఉక్కిరిబిక్కిరి చేశాయి ఆయనను. చెరువులు నింపటం మొద లైనప్పటి నుంచి రోజూ అదేపరిస్థితి అని, ఇంకొన్నాళ్ల పాటు అంతేనని అన్నారాయన. ఇది జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని పరిస్థితి. వర్షాల వల్ల చెరువులు, కుంటలు ఎంతో కొంత నిండి దశాబ్దం అయి ఉంటుంది. వానలు ఈసారి కూడా జిల్లాలో హీనమే. కాని కొత్తగా పూర్తయిన కోయిల్ సాగర్ ఎత్తి పోతల కుడి ప్రధాన కాలువ పుణ్యమాఅని కృష్ణానది నీటితో ఇప్పటికి 32 చెరువులు నిండా యి. ఇతరత్రా డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నీటి ప్రవాహం గురించి చెప్ప నక్కరలేదు. రైతులకు ఎటుచూసినా తమ పొలాలు పచ్చగా కన్పిస్తు న్నాయి. మంచినీటి కొరత తీరింది. చెరువులలో చేపలు వదలటంతో ముదిరాజ్‌లకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ తమ కళ్ల ఎదుటనే వేగంగా చోటు చేసుకుంటుండటంతో ఆయకట్టు ప్రాంతమంతటా అక్షరాలా ఒక జల కోలా హలం వంటి వాతావరణం ఏర్పడింది. జూరాల జలా శయం నీరు వృథా కాకూడ దన్న ఆలోచనతో ఇంజినీర్లు ఒక వైపు చెరువులను నింపుతుండ గా, “ఆలస్యా న్ని” భరించలేని గ్రామాలవారు తామే కాలువలకు గండ్లు కొట్టి నీటిని చెరువులలోకి మళ్లించుకుంటున్నారు. నిజానికి పైన పేర్కొన్న 32 చెరువులలో 14 చెరువులను వారు ఆ విధంగా నింపుకున్న వేనంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించ వచ్చు. ఒకటి తర్వాత ఒకటిగా నింపు తామని, నీరంతా ఒక వైపే ఇస్తే మరొక వైపున, ఆయకట్టు చివరన గల చెరువులకు ఇబ్బంది కదా అని అధికారులు ఇచ్చే వివరణలు రైతులను సమాధాన పరచటం లేదు. తాము ఫోన్లపై కోరటం తో పాటు స్థానిక నాయకులతో ఒత్తిడి చేయిస్తున్నారు. కాలువలలో నీరు అందుతూనే ఉండగా ఈ ఒత్తిళ్లు ఎందుకు? నీళ్లు ఉండగానే చెరువులు నింపించుకుంటే మరి కొద్ది మాసాల్లో మొదల య్యే యాసంగి పంటకు అది భరోసా అవుతుం దని రైతులు స్వయంగా చెప్తున్నారు. అంతేకాదు. చెరువులలో ఇప్పుడు వదిలే చేపలలో వీలైనంత ఎక్కువ బతకాలంటే కూడా అది అవసరం.

పాత మహబూబ్‌నగర్ జిల్లా లెక్కల ప్రకారం చూసినా, ఇపుడు జిల్లా విభజన తరువాత అదే పేరిట మిగిలిన జిల్లా లెక్కను బట్టి అయినా ఇది పూర్తిగా కొత్త పరిస్థితి. రోడ్డుకు రెండు వైపులా కనుచూపుమేరు పరచు కుని ఉన్న పచ్చని వరి, కంది, వేరుశనగ, పత్తి పొలాల మీదుగా ప్రయా ణిస్తూ అక్కడక్కడ గ్రామాలలోకి వెళ్లి రైతులు, కూలీలు, వృత్తిపనుల వారు, ముదిరాజ్‌లతో మాట్లాడినపుడు పరిస్థితులేమిటి, గతంకన్నా వచ్చిన మార్పులేమిటన్నది అర్థమైంది. గతానికి, వర్తమానానికి గల తేడా అనుభవానికి వస్తున్న కారణంగానే, గ్రామీ ణులలో ‘ద గ్రేట్ గోల్డ్ రష్’ అన్న పద్ధతిలో ‘ద గ్రేట్ వాటర్ రష్’ ఒకటి కనిపిస్తున్నది. ఇది ఎంతవరకు వెళ్లిం దంటే, ఇప్పటికే చెప్పుకున్నట్లు తామే కాల్వలకు గండ్లు కొట్టి చెరువులను నింపుకోవటం నుంచి మొదలుకొని అసలు మహబూబ్‌నగర్ పట్టణానికి మంచి నీళ్లను తమ చెరువులు నిండినాకే ఇవ్వాలని డిమాండ్ చేసే వరకు పోయింది. ఇది ఈ ప్రాంతపు సుదీర్ఘమైన కరువు పీడిత నేపథ్యం నుంచి ఏర్ప డిన స్థితి అని, ఇపుడిక నీటికి హామీ ఏర్పడుతున్నందున ఒకటి రెండు సీజన్ల అనుభవాల తరువాత క్రమంగా సర్దు బాటు కాగలదనే అభిప్రాయం రైతులతో మాట్లాడిన మీదట కలిగింది. మరికల్ మండలం పూసల్ పహాడ్ గ్రామా నికి చెందిన బొక్కల ఎల్లారెడ్డి (70 సం॥) ఉమ్మడి కుటుంబానికి 15 ఎక రాలున్నా గతంలో ఎన్నడూ సంతృప్తి లేదన్నాడు. కాలువల్లో చాలీచాలని నీళ్లు, అది కూడా ఎపుడోగాని వచ్చేవి కావని, 150 అడుగుల వరకు వేసిన బోర్లు కొంతవరకే ఉపయోగ పడేవని అన్నాడు. అక్కడివి చౌడు భూములు అయినందున ఎప్పుడూ తడి ఉండటం అవసరం. అది మరొక సమస్య. ఇటువంటి పరిస్థితుల వల్ల ఎత్తిపోతలు పూర్తి కావటం తమకు వరంగా మారిందన్నాడు. తీలేటి ఆంజనేయులు (46, యస్.సి) అన్నదమ్ములతో కలిపి 2 ఎకరాల 30 గుంటలభూమి ఉన్నా నీటికి నమ్మకం లేక, ఖర్చులు చేయ లేక ఏడాదికి రూ. 40,000కు కౌలు కిచ్చారు. దంపతు లిద్దరూ కూలి చేసి జీవిస్తు న్నారు. ఇపుడు నీళ్లు వస్తున్నందున వచ్చేసంవత్సరం నుంచి తామే సాగు చేసుకోగలమని చెప్పా డు.

ఊరి ఓటర్లు సుమారు 1300 మంది కాగా వారిలో ముష్టోళ్లు (బిసి) 200మంది దాకా ఉంటారని వారిలో ఒక రైన సామ వెంకటయ్య(50)చెప్పాడు. భూమి 5 ఎకరాలుం డేదిగాని సరిగా సాగక, అనారోగ్యం వల్ల అమ్మి కూలిపనితో జీవిస్తున్నారు. కాని పనులు సంవత్సరం పొడ వునా దొర కవు. లిఫ్ట్‌తో వ్యవసాయాలు బాగుపడుతున్నాయి గనుక ఇక ఆ సమస్య ఉండకపోవచ్చునన్నాడు. అదే కులానికి చెందిన మల్లెగాని ఆంజనేయులుకు 8 ఎకరాలు ఉన్నా ఆదాయం చాలక కూలికి కూడా పోతుంటాడు. ఇక నుంచి వ్యవ సాయం బాగుపడుతుంది గనుక కూలి పనులు పెరిగే మాట నిజమేగాని, తనకు ఆ అవసరం ఉందడన్నాడు. ఊరిలో ముస్లిం కుటుంబాలు 12 వరకు ఉన్నాయి. వారిలో ఒకరైన చాంద్ పాషా (62) తన మూడెకరాలను పంట భాగస్వా మ్యం పద్ధతిలో మరొకరితో కలిసి సాగు చేస్తున్నాడు. వానా కాలం పంట ఒకటే వేస్తామని, ఎత్తి పోతల నీళ్లు వస్తు న్నాయి గనుక ఇకనుంచి యాసంగి పంట కూడా సాగుచేస్తామని చెప్పాడు. అయిదు ఎకరాల రైతు శేరు సత్యనారాయణ రెడ్డి, ఇంత కాలం వర్షాకాలపు పంటకు కూడా నీళ్లు నికరంగా లేనం దున వరి దిగుబడి తక్కువగా ఉండేదని, ఇపుడు ఎత్తి పోతల తో ఆయకట్టు స్థిరపడుతున్నందున దిగుబడి రెట్టింపుకాగల దన్న ఆశాభావంతో ఉన్నాడు. ఆరు ఎకరాలున్నా అయిదు గురున్న కుటుంబాన్ని పోషించలేక భార్యతో పాటు కూలీ కూడా చేసే గుండుమల్ల గోవిందరెడ్డి (40)కి మూడు లక్షల రూపాయల అప్పున్నది. కోయిల్‌సాగర్ నీరు గ్యారంటీ కావటంతో వ్యవసాయం బాగుపడగలదని, అప్పుల నుంచి బయటపడగలనన్న ఆశాభావంతో ఉన్నాడాయన.

ఉపసర్పంచ్ అయిన వడ్ల రామాచారి (42) తనకున్న అర ఎకరం ఎటూ కానిది గనుక వడ్రంగం, కమ్మరపని రెండూ చేస్తున్నాడు. ఈ వృత్తి మనిషి ఊరిలో తనొక్కడే అయి నా పనులు తగ్గుతున్నాయి. యంత్రాల రాక అందుకు కార ణం. నీళ్లరాకవల్ల తన పరిస్థితి ఏ విధంగా మెరుగు పడ గల దనే ప్రశ్నపై ఆయనకు స్పష్టత లేదు. గాజపగాళ్ల శ్రీను (యస్.సి, 3 ఎకరాలు) తన తండ్రివలెనే వరుసగా వార్డు మెంబర్ అవుతుండటంతో ‘నంబర్ శీను’గా మారాడు. ఆ భూమి తానే సాగు చేసుకుంటున్న ఆయన, లిఫ్ట్ నీళ్లు వస్తు న్నాయి గనుక ఇక నుంచి యాసంగి వరి కూడా వేస్తానన్నా డు. అయితే కాలువల్లో ఇంతకు ముందునీరు సరిగా రాక పేరుకున్న పూడికలు తీసేయించాలని శీనుతో సహా పలు వురు అన్నారు. ఇంజినీర్లు చెప్పినదాని ప్రకారం, పూడిక లేని కాలువ ద్వారా ఒక పంట తడికి ఎన్ని రోజులు పడుతుందో, పూడిక ఉన్నందున అంతకు రెట్టింపు రోజులు తీసుకుంటుంది. నీళ్లునింపి చేపలు కూడా వదిలిన చెరువులలో చిన చింతకుంట మండలం బండర్‌పల్లి చెరువు ఒకటి. అక్కడ బుల్లు కనకప్ప(తెలగ) చెప్పిన దానిని బట్టి చెరువులో మూడేళ్లుగా సరిగా నీళ్లులేవు. పంటలకు, పశువులకు తాగేం దుకు, చేపల పెంపకానికి అన్నిటికీ సమస్యే అయింది. ఈ సారి కోయిల్ సాగర్ పథకం కింద చెరువు ను అనుకున్న దానికన్న ఎక్కువ నింపారు. ఆ ఊరి మత్సకార సంఘం కార్యదర్శి వాకిటి రాజేందర్, సర్పంచ్ సువర్ణ బర్త గోకం ఆంజనేయులు తమ చెరువు గట్టుపైకి తీసుకు వెళ్లి సంతో షంగా చూపుతూ, చెరువు విస్తీర్ణం లెక్క ప్రకారం ప్రభుత ్వం 20 వేల చేప పిల్లలను వదలగా, తాము ఉత్సా హంతో మరో మూడు లక్షలు వేసినట్లు చెప్పారు. కాని అందులో చాలా వరకు చిన్నవని, బతకవని కూడా అన్నారు. అది వారికి నీటిని చూసి కలిగిన అత్యుత్సాహ మనిపించింది. ఊరి కుటుంబాలు 550లో గెలగలు (ముది రాజ్) సగం వరకు ఉన్నారు. వారిలో 50 మంది వరకు సొసైటీ సభ్యులు కాగా అందరూ ఇక బాగా లాభపడ గలరని చెప్పారు.

చినచింతకుంట మండలానికే చెందిన ఉంద్యాల గ్రామం చిన్నదే అయినా చెరువులు, కుంటలు కలిపి ఏడు న్నాయి. జూలై చివరి నుంచి ఆరంభించి వాటిలో ఇప్పటికి నాలుగు నిండగా, తక్కినవి కూడా నింపాలని ఎంపిటిసి మల్లేపల్లి రామ లింగా రెడ్డి, మండల్ మాజీ ఉపాధ్యక్షుడు బత్తుల దయాకర్ గౌడ్ కలిసి కోయిల్ సాగర్ ఇంజి నీర్లకు దాదాపు ముప్పావు గంటసేపు నచ్చచెప్తూనే పోవటం చూశాను నేను. ఆ గ్రామంలో 1120 కుటుంబా లుండగా 800 మంది కిపైగా వ్యవసాయం చేస్తారు. తక్కిన వారు కూలీలు, బీడీ పనులవారు. కాలువలు రాకముందు “అంతా ఎడారే” నని, ఇప్పుడు వ్యవసాయం బాగుపడటంతో పాటు కూలీలకు డిమాండ్, రేట్లు కూడా పెరిగాయని చెప్పారు. మగ కూలీలకు రూ. 300-350కాగా, ఆడవారికి రూ.200- 250. మరికల్ సర్పంచ్ జోగులక్ష్మి భర్త రామ స్వామి అయితే తమ చెరువులు, కుంటలు మొత్తం ఏడు కూడా నిండాయని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పాడు. దానితో 800 మందికిపైగా రైతులు లాభపడుతున్నారని, ఆ రోజునే పెద్ద చెరువులో లక్షకుపైగా చేప పిల్లలు వదిలారని అన్నాడు. ఆ ఊరిలో ముదిరాజ్ కుటుంబాలు సుమారు 150 ఉన్నాయి. కోయిల్‌సాగర్ కుడికాల్వ ఫలితాలు ఇవన్నీ. అటు వంటి గ్రామాలు ఇంకా అనేకం ఉన్నాయి. దేవరకద్ర నుంచి బయలుదేరే ముందు అక్కడికి సమీపాన గల ఎడమ కాల్వ పనులు చూశాను. దాని నుంచి నీరు కొంతకాలం వదలి రైల్వేలైను వద్ద చిన్న పనుల కోసం ఆపారు. అవి రెండు మూడు రోజులలో పూర్తి కానున్నట్లు చెప్పిన ఇంజినీర్లు, అదే ప్రకారం పూర్తిచేసి నీటిని నిరాఘాటంగా వదిలినట్లు నాల్గవ రోజున తెలియజేశారు.

నెట్టెంపాడ్‌తో రెట్టింపు నీళ్లు
ది గ్రేట్ వాటర్ రష్-2

నెట్టెంపాడు రాకతో భూముల ధరలు విపరీతంగా పెరిగిన దాని ప్రభావం అనూహ్యమైన రీతిలో మరొక రూపంలో కన్పించింది నాకు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉండగా ఒక దశలో ఎట్లా జరిగిందో గాని, ఇతరులెవ్వరూ లేక పదిమంది మాదిగలు మాత్రం చేరారు. అందరూ 44 నుంచి 65సంవత్సరాల మధ్య వయసు వారు. వారిలో నలుగురికి భూమి అసలు లేదు. ఇద్దరికి రెండేసి ఎకరాలు, మిగిలిన నలుగురికి రెండులోపల ఉంది. ఆ 10మందిలో ఇప్పటికే పేరు ప్రస్తావించిన దేవదాసు(10వ తరగతి)ను మినహాయిస్తే అందరూ పూర్తి నిరక్ష రాస్యులు. భూమి ఉండటం, లేక పోవటంతో నిమిత్తం లేకుండా అందరూ తమ కుటుంబసభ్యులతో పాటు కూలి పనులు చేస్తారు. భూమి ఉన్నవారిలో కొందరుసాగు చేసుకోగా కొందరు కౌలుకు ఇచ్చారు. ఇతరుల నుంచి కౌలుకు తీసుకున్నవారు కూడా కొద్దిమంది ఉన్నారు. నెట్టెంపాడు నీళ్ల రాక వల్ల సంతోషంగా ఉన్నామని, ఇపుడు “ఎక్కడ చూసినా నీళ్లే” నని ఏకగ్రీవంగా అన్నారు.

నెట్టెంపాడ్ ప్రాజెక్ట్ కింద తమ రేలంపాడు చెరువుకు లోగడ 2 టిఎంసిల నీరు మాత్రమే వచ్చేదని, ఇపుడు ఎత్తిపోతల పనులు పూర్తిచేయటంతో అంతకు రెట్టింపుగా 4 టిఎంసిల నీరు వచ్చిందని ధరూర్ మండలం మార్లబీడు గ్రామ సర్పంచ్ జి.వి.సత్యమ్మ భర్త జనార్థన్‌రెడ్డి చెప్పాడు. ఇంతకుముందు ఎపుడు కూడా 2టిఎంసిలకు మించనందున 10-12 ఊర్లకు మాత్రమే నీళ్లందేవి. ఈసారి అది రెట్టింపు కావటమే కాక అధికారులు చెరువులు, కుంటలు నింపుతున్నందున మొత్తం 80 గ్రామాలకు పైగా లాభపడుతున్నాయని అన్నాడాయన. రేలంపాడును వారు చెరువు అని పిలుస్తున్నా నిజానికి అది జలాశయం. మార్లబీడు కుటుంబాలు 825 లో 80 శాతం వ్యవసాయం చేసేవే. అయితే అత్యధికులు చిన్న కమతాల వారు కావటం, నీటికి హామీలేకపోవటంతో చాలామంది కూలిపని కూడా చేస్తారు. భూమి అసలు లేని ఎస్ సి, ఎస్‌టి, బిసిల కూలీ కుటుం బాలు 10 శాతం వరకున్నాయి. మార్లబీడు మొత్తం భూము లు 1300 ఎక రాలు కాగా అందు లో 600 వరకు పంప్ హౌజ్, కాలువల కోసం గత ప్రభుత్వకాలంలో పోయింది. నీళ్లు రావటం 2013లో మొదలైనా, ఊరికి మిగిలిన 700 ఎకరాలలో సగానికే అందేవి. ఇపుడు 4 టిఎంసిల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినందున ఎండిపోయిన బోర్లలోనూ నీళ్లు వస్తున్నట్లు మార్లబీడుతోపాటు చెన్నారెడ్డి పల్లె వంటి సమీప గ్రామాల రైతులు కూడా చెప్పారు.

వాస్తవానికి నెట్టెంపాడు లిఫ్ట్ రాకముందు కాలువలు రావటం వానలు కురిస్తేనే జరిగేదని, బోర్లు పనిచేయటం మాట అట్లుంచి మంచినీళ్లకు కూడా కష్టమయేదన్నాడు. ఇకనుంచి నీటికి హామీ లభించటంతో పంట దిగుబడి పెరుగుతుందన్నది ఆయన అంచనా. అయితే కాల్వలకు పూడికలు తీయించాలని, గతంలో కాల్వల లెవెలింగ్ సరిగా చేయనందున మార్చాలని, లైనింగ్ అవసరమని, వాటి నిర్వహణను నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిం చటం గాక ఇంజనీర్లే చూడాలన్నవి ఆయన సూచనలు. పిడ్డెన్నగారి దేవదాసు ( 45, యస్‌సి) కు రెండెకరాల భూమి ఉన్నప్పటికీ నీటి సమస్య వల్ల కౌలుకు ఇచ్చాడు. తను వ్యవసాయ కూలీ. రేషన్ డీలర్ పనివంటి ఇతర ఆదాయా లతో కుటుంబం సాగుతున్నది. గట్టు ఎత్తిపోతల వస్తే తన భూమికి నీరందుతుందని, అందినా తాను వ్యవసాయం చేసేది ఖచ్చితంగా చెప్పలేనని అన్నాడు. పెట్టుబడి ఖర్చులు పెరగటం, ధాన్యానికి గిట్టుబాటు ధరలేకపోవటం అందుకు కారణం. అయితే ఆవుల నరసింహులు(బిసి), ఉప్పేటి పెద నర్సింలు (బిసి) చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎత్తిపోతల పథకం ఫలితాలు వారికి ఇప్పటికే అనుభవంలోకి వస్తున్నాయి. ఆవుల నరసింహులు కేవలం అరెకరం కౌలుకు తీసుకుని సీడ్ పత్తి సాగు చేస్తున్నాడు. కూలి పని కూడా చేస్తాడు. తమ పొలమున్న ప్రాంతంలో సాధారణంగా 250 అడుగుల తర్వాతనే బోర్లు పడేవని, వాటిలోనూ చాలా ఎండిపోగా, రేలంపాడులో నీళ్లు పెరిగిన తర్వాత బోర్లకు ప్రాణం వచ్చిందని చెప్పాడు. కొత్తగా వేస్తున్న బోర్లలో కొన్నిచోట్ల 100 అడుగులకే నీళ్లు పడుతున్నాయి. ఇపుడు కూలి పనులు పెరిగి వలసలు తగ్గాయన్నాడు. మును ముందు పూర్తిగా ఆగినా ఆగవచ్చు నన్నది ఆశాభావం.

అక్కడినుంచి కొద్దిదూరంలో పెదనర్సింలు తన స్వంత భూమి మూడు ఎకరాలు సాగుచేస్తున్నాడు. కొంత పత్తి, కొంత వరి, కొంతవేరుశనగ. మనిషి సంతోషంగా కన్పించాడు. గతంలో తనకు నాలుగు బోర్లు వేసినా నీళ్లు రాక ఎక్కడెక్కడికో వలస పోయి బతికామని, ఇపుడు నెట్టెంపాడు నీళ్ల రాకతో సమస్య తీరిందని అన్నాడు. ప్రాజెక్టు వల్ల 10 మందికి భూములు పోయినా తక్కిన 90 మంది బాగా బతుకుతున్నారన్నాడు. భూమి ధరలు కూడా పెరిగాయి. గతంలో ఎకరానికి లక్ష అంటే అబ్బో అనేవారని, ఇపుడు 8-9 లక్షల దాకా పోయిందని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే అసలు అమ్మేవారు దొరకటం లేదట. ఎవరైనా సరే నంటే అడ్వాన్సులిచ్చి పోతున్నారట. రేలంపాడు జలాశయంలో ఈసారి వచ్చినన్ని నీళ్లు తామెపుడూ చూడలేదని అక్కడ చేపలు పడుతున్న మత్సకారులు వాటికి హనుమంతు ( 52, తెలగ), స్వామి (22, బోయ) అన్నారు. మొదటినుంచి కూలీ అయిన హనుమంతు బతుకుతెరువు లేక కొన్నాళ్లు కర్ణాటకకు పోయాడు. ఇపుడు తిరిగి వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నాడు. నిరుడువేసిన చేపపిల్లలు ఇపుడు కొంత ఎదిగాయి. ఈసారి ప్రభుత్వం నాలుగు డిసిఎం ట్రక్కుల్లో తెచ్చి వదిలిందని, ముందు ముందు ఇక సమస్య ఉండదని అన్నాడాయన. ప్రస్తుతం ఆదాయం రోజుకు రూ. 200దాకా ఉంది. మొత్తం 400 మంది దాకా అక్కడ చేపలవేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందులో తెలగలు కేవలం నలుగురు కాగా తక్కిన వారిలో బోయలు, కురవలు, ఎస్సీలు ఉన్నారు.

ఈ ఆర్థిక మార్పుల ప్రభావం ఇతరత్రానూ కన్పిస్తున్నది. ఉదాహరణకు మహమ్మద్ హుస్సేన్ (35) అనే చికెన్-మటన్ దుకాణందారు, తాను లోగడ ఒక యాటను కోసి రెండురోజులు అమ్మేవాడినని, ఇపుడు రోజుకొకటి కోస్తున్నానని చెప్పాడు. ఊరిలో చికెన్-మటన్ అమ్మే దుకాణాలు మూడు, కేవలం చికెన్‌వి మరొక మూడు ఉన్నాయి. అన్నీ బాగానే నడుస్తున్నాయట. ఆరింటిలో మూడు దుకాణాలు హుస్సేన్ అన్నదమ్ములవే. వారికి పొత్తులో ఆరెరకాల భూమి ఉందిగాని కౌలుకిచ్చారు. భూమి రేలంపాడుకు దగ్గరే అయినా ఎత్తులో ఉన్నందున నీళ్లెక్కవన్నాడు. గట్టు ఎత్తిపోతలపై ఊరిలోని కొందరు ఇతర రైతులవలెనే హుస్సేన్ కూడా ఆశపెట్టుకున్నాడు. గట్టు పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టు రాక తర్వాత సుమారు నాలుగు నెలల క్రితం ఊరిలో కొత్తగా ఒక బేకరీ మొదలైంది. అమ్మకాలు రోజుకు రూ. 500-600 వరకు ఉన్నాయని చెప్పాడు నూర్‌బాషా(40). ఇంతకుముందు “చాలా” ఏళ్లుగా ఒక అతిచిన్న చాయ్ దుకాణం మాత్రం ఇంటివరాండాలోనే నడుపుతున్నాడు. నెట్టెంపాడు రాకతో భూముల ధరలు విపరీతంగా పెరిగిన దాని ప్రభావం అనూహ్యమైన రీతిలో మరొక రూపం లో కన్పించింది నాకు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉండగా ఒక దశలో ఎట్లా జరిగిందో గాని, ఇతరులెవ్వరూ లేక పదిమంది మాదిగలు మాత్రం చేరారు. అందరూ 44 నుంచి 65సంవత్సరాల మధ్య వయసువారు. వారిలో నలుగురికి భూమి అసలు లేదు. ఇద్దరికి రెండేసి ఎకరాలు, మిగిలిన నలుగురికి రెండులోపల ఉంది. ఆ 10మందిలో ఇప్పటికే పేరు ప్రస్తావించిన దేవదాసు(10వ తరగతి)ను మినహాయిస్తే అందరూ పూర్తి నిరక్షరాస్యులు. భూమి ఉండటం, లేకపోవటంతో నిమిత్తం లేకుండా అందరూ తమ కుటుంబసభ్యులతో పాటు కూలిపనులు చేస్తారు. భూమి ఉన్నవారిలో కొందరుసాగు చేసుకోగా కొందరు కౌలుకు ఇచ్చారు. ఇతరుల నుంచి కౌలుకు తీసుకున్నవారు కూడా కొద్దిమంది ఉన్నారు. నెట్టెంపాడు నీళ్ల రాక వల్ల సంతోషంగా ఉన్నామని, ఇపుడు “ఎక్కడ చూసినా నీళ్లే” నని ఏకగ్రీవంగా అన్నారు.

మొత్తంమీద వారికందరికి భూములు, నీళ్లగురించి అనుభవపూర్వకంగా తెలుసు. మాటల మధ్యలో, ఎస్సీలకు ప్రభుత్వం ఇస్తామన్న మూడెకరాల భూమి పథకం ప్రస్తావన తెచ్చి, తమకు దానిపై పెద్ద ఆసక్తి లేదన్నారు. ఆ మాట ఎంత అనూహ్యంగా వచ్చిందో అంత ఆశ్చరకరంగా తోచింది. ఆ మాటకు వారు కారణాలు చెప్పి, ప్రత్యా మ్నాయం గురించి కూడా మాట్లాడారు. వారు చెప్పిన కారణాలు – భూమి ఇవ్వాలన్నా ఊరిలో అమ్మేవాళ్లు లేరు. ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. ప్రభుత్వం కొంటానంటే ఇంకా పెంచుతారు. చివరకు ఏమీ జరగటం సాధ్యం కాదు. అట్లాగే కాలం గడిచి పోతుంది. అంతకన్నా ఇప్పటికే కొంత భూమి ఉన్నవాళ్లకు సాగు కోసం సహాయం చేయాలి. వాళ్లకుగాని, భూమి హీను లకుగాని మంచి ఉపాధి కోసం మేకలు, గొర్రెలు, బర్రెలు, ఎద్దులు (అద్దెకు ఇచ్చు కునేందుకు), చిన్న వ్యాపారాలు, చెప్పుల దుకాణాలు, పిండి గిర్నీలు, ఆటోలు మొదలైన రూపంలో సహాయం అందించాలి. ఇటువంటివి అయినా, భూమి అయినా బతుకు తెరువు కోసమే గనుక, ఇవి జరిగితే తాము భూమి రాలేదే అన్న ఆలోచన పెట్టుకోబోమని అన్నారు వారు. ఈ రకరకాల మాటల్లో ఎవరు ఏదన్నా తక్కిన వారి నుంచి అవునవునన్న మాటలు, తల ఊపటాలు మాత్రమే తప్ప భిన్నాభిప్రాయం ఒక్కటైనా లేకపోవటం గమనార్హంగా తోచింది. వారు తమలో తాము కొంత కాలంగా చర్చించు కుంటుంటే తప్ప, అప్పటికప్పుడు రాగల ఆలోచనలు, ఏకాభిప్రాయాలు కావవి అని మాత్రం చెప్పవచ్చు.

ది గ్రేట్ వాటర్ రష్-3

(భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి)

నిర్వేణి తదితర గ్రామస్తులైన రైతులు, కూలీలు, ముదిరాజ్ వంటి వృత్తిపనుల వారికి, శివసముద్రం రిజర్వాయర్ పూర్తితో, జూరాలనుంచి కృష్ణానది జలాలు అందులో నిండటంతో తమ జీవితాలు మారిపోగలవని స్పష్టంగా అర్థమైంది. రిజ ర్వాయర్ గేట్ల పనులు ఇదే నవంబర్‌లో పూర్తికానున్నాయి. రెండవ వైపు మిగిలిన గట్టుపని కొంత కూడా ముగియగానే నీటిమట్టం పెరగటం మొదలవుతుంది. పొరుగునే గల గ్రామాల రైతులకు, పూర్తిస్థాయి నీటి సదుపాయానికి మధ్య మిగిలింది కొద్ది కాలపు ఉత్కంఠ మాత్రమేనని అర్థమైంది.

కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు ప్రాంతంలో పర్యటన ముగించుకుని ఇక హైదరాబాద్ తిరిగి రానుండగా, బాగా ఆకర్షించిన దృశ్యం ఒకటి కన్పించింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రం సమీపంలో ప్రధాన రహదారికి పక్కన పాలెం చెరువు ఉంది. 0.198 టిఎంసిల నీటి నిలువ సామర్థంతో సుమారు 600 ఎకరాలకు నీరివ్వగల ఆ చెరువు అంచుల దాకా నిండిపోయి ఉంది. తిరిగి వెళ్లేముందు ఎదురైన చివరి చెరువు గనుక దానిని మరింత దగ్గరగా చూడాలనిపించి, ఊరిలోంచి రెండవవైపు వెళ్లగా అది అలుగు పడుతున్నది. అక్కడ స్త్రీలు, పురుషులు, పిల్లలు, అలుగు చూసేందుకు దగ్గరి ఊర్లనుంచి వచ్చిన వారితో అంతా కోలాహలంగా ఉంది. గంగమ్మకు శాంతి చేసేందుకు ఒకరు అప్పుడే పందిని బలిచ్చారు. పాలెం చెరువుకు అలుగు పడటం గతంలో ఏడేళ్ల కిందట 2009లో జరిగిందన్నారు. అపుడది జరిగింది వర్షాలవల్ల. మనిషి ప్రమేయం లేదు. ఈసారి ప్రభుత్వ కృషివల్ల కల్వకుర్తి ఎత్తిపోతల కాలువ లతో అనేక చెరువు లు నిండుతున్నా యి. ఇప్పటికి ఇటు ప్రాంతంలో చెరు వులు, కుంటలు కలిపి 50 వరకు నిండగా మరో 30 వరకు నింపనున్న ట్లు ఇంజనీర్లు చెప్పారు. వాటిలో పాలెం చెరువు ఒకటి. ఇక్కడ అలుగు పడుతున్న మిగులు నీరు గొలుసుకట్టు పద్ధతిలో నాగర్ కర్నూల్ మండలంలోని కేసరి సముద్రం చెరువువైపు పోతూ కన్పించింది.

ఇదే బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామ సర్పంచ్ జుర్రు కృష్ణయ్య (35,గొల్ల) చెప్పిన దానిని బట్టి ఈసారి వచ్చిన కొద్దిపాటి వానలు నేలను తడిపేందుకే సరి పోయినై. కల్వకుర్తి ఎత్తిపోతల నీరు గుడిపల్లి నుంచి కాల్వ ద్వారా రావటం, తమ ఊరి చెరువులతో పాటు రెండు కుంటలు కూడా నిండటం వల్ల వ్యవసాయం దారిన పడింది. బోర్లకు కూడా నీరెక్కటంతో అందరూ రెండు పంటలు సాగుచేసే అవకాశం ఉంది. ఊరి కుటుంబాలు 450లో 10 తప్ప అందరూ రైతులే. గతంలో బోర్లున్నవారు మాత్రం కొంత భరోసాగా వ్యవసాయం చేసేవారు. నీళ్లు 200-250 అడుగుల లోతున పడుతున్నాయి. ఈసారి ఎండిన బోర్లు మళ్లీ ఊరినట్లు అదే గ్రామానికి చెందిన పొలమోని బంగారయ్య (తెలగ,34)చెప్పాడు. మూడున్నర ఎకరాలుగల ఆ రైతుకు కాలువనీరు అందే అవకాశం లేనందున బోరునీళ్లే ఆధారం. వరి, మొక్కజొన్న, వేరుశనగ సాగు చేస్తున్నాడు. కాలువ దగ్గరలోనే రెండెకరాలుండి ఒక బోరు కూడా నడుపు తున్న మహమ్మద్ హుస్సేన్( 45), కాలువ వల్ల ఒక పంటకు భరోసా వచ్చిందని, 13 ఎకరాలుగల గుడ్లనరువ ఆంజ నేయులు (55,రజక) వర్షాలు, బోర్లతో కలిపి సరిగా సాగు చేయగలుగుతున్నది సుమారు మూడెకరాలే! తక్కిన దంతా కేవలం వర్షాధారం. ఇపుడు ప్రాజెక్టుతో మొత్తం భూమికి నీళ్లు దొరుకుతాయని ఉత్సాహంగా చెప్పాడు. గతం కన్న బాగుపడింది ఏమిటని అడిగితే కొద్ది క్షణాలు ఆలోచించి, బాగుపడనిది ఏమైనా ఉండదా అని ఎదురు ప్రశ్న వేశారు.

నక్కా బచ్చలయ్య (40,గొల్ల) కుటుంబంలోని నలుగురి కి 24 కిలోల రేషన్ సరిపోక సుమారు 20 రోజులకోసం బియ్యం బయట కొంటున్నాడు. ఉన్న ఒకటిన్నరెకరాల్లో మొక్కజొన్న వేస్తున్నాడు. కాలువనీళ్లతో ఇకముందు వరి సాగుచేస్తే ఇంటికి సరిపోతాయని, నలుగురూ చేసే కూలి ఆదాయం ఇతర అవసరాలకు వస్తుందని చెప్పాడు. మహదేవుని పేట 450 కుటుంబాల్లో తమ మాదిగలవి 60-70 వరకు ఉంటాయన్నాడు పాతకోత శాంతయ్య(36). వారి లో 4-5గురికి తప్ప అందరికి ఎంతోకొంత భూమి ఉందని, తమ బోర్లలో నీరు ఇప్పటికే 25శాతం పెరిగిందని, ఇంకా పెరిగే సూచనలున్నాయని చెప్పాడు. కూలిపనులు కూడా చేసుకునే మాదిగలకు ఇంతవరకు ఒకోసారి ఖాళీగా ఉండవలసి వచ్చేదని, ఇపుడు ఆ ప్రాంత మంతటా వ్యవసాయాలు పెరుగుతున్నందున ఆ సమస్య ఉండబోదని అన్నాడు. వలస లు పూర్తిగా ఆగకున్నా తగ్గినట్లు చెప్పాడు. ఎనిమిది మంది అన్నదమ్ముల మధ్య 70 ఎకరాలు గల ఎద్దుల మన్నపురెడ్డి తన మోటార్ బైక్ ఇంజన్‌ను రేజ్ చేస్తూ, అక్కడ నాలుగైదేళ్ల క్రితం ఎకరానికి రూ. 60 వేలు ఉండిన భూమి ధర ఇపుడు ఆరేడులక్షలు అయిందంటూ నవ్వాడు. కాలువల నీళ్లు రావటం, చెరువులు నిండటం, బోర్లు ఊరటంతో మంచినీటి సమస్య పరిష్కారం కావటమన్నది ప్రతిచోట కన్పిస్తున్న పరిస్థితి. ఇది అనేకులు మనం అడగ కుండానే చెప్తున్న విషయం. కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు వనపర్తి జిల్లాలోని భీమా ఎత్తిపోతల గ్రామాల ప్రజలలోనూ ఈ సంతోషం కన్పిం చింది. భీమా రెండవ లిఫ్ట్‌కింద కానాయి పల్లి వద్ద నిర్మిస్తున్న శంకరసముద్రం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల ఆ గ్రామమైతే పూర్తిగా ముంపుబారిన పడుతున్నది గాని రెండు ప్యాకేజీలలో కలిపి 57,000 ఎకరాలు సాగు కానున్నది. నేను అక్కడకు వెళ్లినరోజున గేట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్‌లో పూర్తి కాగలవన్నారు ఇంజినీర్లు. అక్కడికి సమీపంలోనే గ్రామస్తుల పునరా వాసానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రిజర్వాయర్ కింద తన ఆరెకరాలు కోల్పోయిన దున్న పోతుల వెంకటరెడ్డి (50) అందుకు విచారిస్తూనే, ప్రాజెక్టుతో రైతులు లాభపడతారన్నాడు. ప్రాజెక్టు రెండవ వైపున తనకు మరికొంత భూమిఉంది. గతంలోనూ రెండు పంటలు వేసే వాళ్లమని, కాని ఈ నీళ్ల భరోసాతో మునుముందు మంచి పంట తీయగలమని అన్నాడు. అందరూ వరి సాగే చేస్తున్న ట్లు గట్టుపైనుంచి ఎటు చూసినా కన్పించింది. రిజర్వాయర్ కోసం 2007 లోనే రెండెకరాలు, ఇల్లు కోల్పోయిన ఇర్రదిన్లె నాగరాజు(41,వడ్డెర) ఆ పరిహారంతో బర్రెలు కొని కొంత కాలం పాడి వ్యాపారం చేసాడు. కాని గడ్డి సరిగా దొరకక నష్టం వచ్చి బర్రెలు అమ్మివేసానన్నాడు. అపుడు చాలా మందికి అదే అనుభవం ఎదురైందని, ఎద్దులు, గొర్రెలకు నీళ్లు కూడా సరిగా దొరకలేదని చెప్పాడు. ఇపుడు శంకర సముద్రం పూర్తవుతుండటం, వరి సాగు అభివృద్ధితో తిరిగి పాడికి అవకాశాలు రావచ్చునన్నది ఆయన ఆలోచన. తనకు కూడా ప్రాజెక్టు రెండవవైపున 10 గుంటల భూమి ఉంది. ఆ రెండవ వైపున పచ్చని పొలాల మధ్యగా దూరాన చిన్నచిన్న గ్రామాలు కన్పించాయి. వాటిలో ఒకటైన నిర్వేణి నుంచి చీకటికుంట బాలయ్య(35, ముదిరాజ్) రిజర్వా యర్‌లో చేపలు పట్టేందుకు గాలంతో వస్తూ కన్పించాడు. రెండెకరాల చిల్లర భూమిగల ఆయన కొంత వరివేసి, కొంత కౌలు కిచ్చాడు. ఇపుడు కుంటకింది నీళ్లు వాడుతున్నానని, ప్రాజెక్టు పూర్తయినాక కౌలుకు ఇచ్చింది కూడా తానే సాగు చేసి యాసంగి పంట కూడా తీస్తానని అన్నాడు. మధ్యమధ్య ఖాళీ ఉన్నపుడు ఇటువచ్చి చేపలు పడతాడు. ఈ మధ్య అయిదు లక్షల చేపపిల్లలు వదిలారట. గ్రామంలోని 500 కుటుంబాల్లో 400 వరకు ముదిరాజ్‌లవే. వారికి సొసైటీ కూడా ఉంది.

నిజానికి ఇంజనీర్లు తాత్కాలికమైన పంపులు 10 ఏర్పాటు చేసి నిర్వేణి తదితర గ్రామాలవైపు పోయే కాలువ లోకి నీళ్లు వదులుతుండటం చూసాను. కాని రిజర్వాయర్‌లో నీటిమట్టం గేట్ల నిర్మాణం జరిగే లోగా తక్కువ వుండి పంపులవద్ద ప్రెషర్ కూడా తక్కువవుతుంది. కనుక కాలువలో నీటి ప్రవాహపు వేగం తక్కువ గనుక, పగలు ఆరుగంటలు, రాత్రి మూడుగంటలు కరెంటు ఇస్తున్న వ్యవధిలో పారకం ఎక్కువ దూరం ఉండటం లేదు. కాలువకు దూరాన భూమిగల బాలయ్యకు గాని, నిర్వేణి కన్న పైన గల కాలువ గ్రామాలకు గాని నీరు ఇంకా రావటం లేదు. కరెంటు 24 గంటలిస్తే పరిస్థితి బాగుపడుతుందని రైతులన్నారు. అజ్జెకొలి రాములు, పుల్లన్న గారి వెంకటేశ్, తదితర ముది రాజ్ రైతులు కాలువనుంచి మోటార్లతో నీళ్లు తీసుకుని, పక్కనేగల తమ పొలాలను స్ప్రింక్లర్లతో తడుపుతూ కన్పించారు. అదేమార్గంలో మరికొంత ముందుకు వెళ్లగా, కాలువలో నీళ్లు కొన్ని రోజుల క్రితం వచ్చిన ఆనవాళ్లు న్నాయి. మళ్లీ వచ్చినపుడు తీసుకునేందుకు రైతులు ఇంజను, పైపులు వేసుకుంటున్నారు. ఇదంతా కూడా పాత మహబూబ్‌నగర్ జిల్లా అంతటా కనిపిస్తున్న జలకోలాహలంలో భాగమేనని తోచింది. నిర్వేణి తదితర గ్రామస్తులైన రైతులు, కూలీలు, ముదిరాజ్ వంటి వృత్తిపనుల వారికి, శివసముద్రం రిజర్వాయర్ పూర్తితో, జూరాలనుంచి కృష్ణానది జలాలు అందులో నిండటంతో తమ జీవితాలు మారిపోగలవని స్పష్టంగా అర్థమైంది. రిజర్వాయర్ గేట్ల పనులు ఇదే నవంబర్‌లో పూర్తి కానున్నాయి. రెండవ వైపు మిగిలిన గట్టుపని కొంత కూడా ముగియగానే నీటిమట్టం పెరగటం మొదలవుతుంది. పొరుగునే గల గ్రామాల రైతులకు, పూర్తిస్థాయి నీటి సదు పాయానికి మధ్య మిగిలింది కొద్ది కాలపు ఉత్కంఠ మాత్రమేనని అర్థమైంది.

Source: Mana Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *