mt_logo

కెనడాలో ‘తెలంగాణ ప్రకాష్’ పుస్తక ఆవిష్కరణ

కెనడా లోని మిస్సిస్సౌగా నగరంలోని మాల్టన్ కమ్మునిటి లైబ్రరీ హాలులో తేది 17 జూలై, 2016 ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెలంగాణ వాసులతో “తెలంగాణ ఉద్యమాల చరిత్ర” ఇంగ్లీష్ వెర్షన్ “History of Telangana Movements” పుస్తకమును శ్రీ కైరోజు సీతారాములు, శ్రీ తిరుమలాపురం పెంటయ్య, శ్రీ నేరెల్లపల్లి మహేందర్ రెడ్డి, శ్రీ రాం రెడ్డి మరియు శ్రీ గడ్డం రామేశ్వర్ రెడ్డి గార్లు పుస్తక రచయిత శ్రీ వీరమల్ల ప్రకాష్ గారి సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ వీరమల్ల ప్రకాష్ గారు సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర చరిత్ర అధ్యయనంతో బంగారు తెలంగాణ సాదించుకోవచ్చని, గతపాలకులు తెలంగాణ పట్ల చూపిన వివక్ష వలన ప్రజలకు జరిగిన అన్యాయలను సమగ్రంగా చదివి తెలుసుకొని పరిపూర్ణమైన అవగాహనతో పతకాలను రూపొందించుకున్నప్పుడే ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణ త్వరితగతిలో సాధించుకొనుట సాధ్యమని తెలిపారు. ప్రవాస తెలంగాణ వారందరూ బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొని వారి సూచనలను, వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సలహాలను ఎప్పటికప్పుడు అందించాలని ఈ సందర్భంగా కెనడాలోని తెలంగాణ వాసులకు శ్రీ ప్రకాష్ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం “తెలంగాణ కెనడా అసోసియేషన్” Telangana Canada Association (TCA) ఆధ్వర్యంలో జరుగగా ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల మొత్తం కార్యక్రమనికి అధ్యక్షత వహించారు, అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు, ట్రస్టీ చైర్ శ్రీ అఖిలేష్ బెజ్జంకి మరియు FC చైర్ శ్రీ శ్రీనాథ్ రెడ్డి కుందూరిగార్లు ప్రసంగిచారు మరియు తెలంగాణ IT అసోసియేషన్ కార్యక్రమాలను శ్రీ రంజిత్ విశదీకరించారు.

ఈ కార్యక్రమంలో దాదపు నూరు మంది తెలంగాణ వాసులతో పాటు “తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA)” ఉపాధ్యక్షులు శ్రీ కోటెశ్వర్ రావు, కోశాధికారి శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ఉప కోశాధికారి శ్రీ శంతన్ రెడ్ది నేరెల్లపల్లి, డైరక్టర్లు శ్రీ సంతోశ్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి, ట్రస్టీ శ్రీమతి శీరీష స్వర్గం, శ్రీ సంపత్ బాలమోని మరియు తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మునాఫ్ అబ్దుల్ గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *