కెనడాలో అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలు

  • June 9, 2017 10:52 am

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో తేది జూన్ 3 2017 శనివారం రోజున మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో దాదాపు 500కు పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు.

తెలంగాణ కెనడా సంఘం ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు తెలంగాణ జాగృతి కెనడాకు ప్రథమ అధ్యక్షులుగా నియమింపబడినందులకు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారిని మరియు శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల గారిని కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ వేడుకలు కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం గారి ఆధ్వర్యంలో ఎన్నో వివిద సాంస్కృతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి. పోతరాజు వేషంలో శ్రీ గిరిధర్ క్రొవిడి గార్లు అద్భుతమైన లష్కర్ బోనాల ఊరేగింపు మరియూ పీరీల ప్రదర్శన సభికులందర్ని విషేషంగా ఆకర్షించాయి.

ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి  గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్రస్టీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి, కల్చరల్ సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ శ్రీ సంతోష్ గజవాడ మరియు డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ దామోదర్ రెడ్ది మాది, శ్రీ మురళి కాందివనం, శ్రీమతి భారతి కైరోజు, శ్రీ మల్లికార్జున్ మదపు, ట్రస్టీలు శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ నవీన్ రెడ్ది సూదిరెడ్ది,  శ్రీ హరి రావుల, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, శ్రీ వేణు రోకండ్ల మరియు  ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహిం చారు.

ఈ కార్యక్రమానికి వ్యాక్యాతలుగా శ్రీమతి స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద మరియు మేఘ స్వర్గంలు వ్యవహరించారు.

ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద గారు వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE