mt_logo

అంబులెన్సులను ప్రారంభించిన స్పీకర్ పోచారం, కేటీఆర్

‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంబులెన్సులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు 14 అంబులెన్సులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ అంబులెన్సులను కోవిడ్ సహాయక చర్యల కోసం ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 2 అంబులెన్సుల కొనుగోలు కోసం రూ. 41 లక్షల చెక్కును ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మర్రి జనార్ధన్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజులు పాల్గొన్నారు.

ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. రూ. 1,360 కోట్లతో 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కొల్లూరులో నిర్మించారు. త్వరలో పేదలకు ఈ ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *