mt_logo

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (మొదటి భాగం)

సీమాంధ్ర నేతల క్షుద్ర రాజకీయాలకు బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆత్మ త్యాగానికి ఒక్క రోజు ముందు తీసిందీ ఫొటో.

అబద్దాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని నిర్మించబూనితే ఏమవుతుంది? ఆంధ్ర ప్రదేశ్ కి గత అయిదు దశాబ్దాలుగా ఏమవుతుందో అదే అవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనేననే అబద్దం పునాదుల మీద  సీమాంధ్ర నాయకులు తెలుగు జాతిని నిలబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న ఈ సమయంలో కూడా డిసెంబర్ 15 నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి  సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు నిముషాలు మౌనం పాటించాలనే సర్కులర్ జారీ చేసి తమ తోక వంకరని మరోసారి నిరూపించుకున్నారు సీమాంధ్ర పాలకులు.

అయితే గత పదేళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం పొట్టి శ్రీరాములుకు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఏమీ సంబంధం లేదని కనీసం తెలంగాణ ప్రజలకు తెలియజెప్పగలిగింది.

అసలు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందని, సీమాంధ్ర రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఆయన అన్యాయంగా బలైపోయాడని ఇప్పుడు దొరుకుతున్న తాజా సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.

తమ వ్యక్తిగత స్వార్ధం కొరకు ఒక నిండు మనిషి ప్రాణాలను అన్యాయంగా బలిపెట్టారని, అసలు పొట్టి శ్రీరాములు మరణం పూర్తిగా నివారించదగినదని మా దగ్గర ఉన్న సాక్ష్యాలు స్పష్టం  చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ తెలియకుండా తొక్కిపెట్టిన ఈ చీకటి కోణంపై MissionTelangana బృందం ప్రత్యేక కధనం:

కధ మొదలవడానికి ముందు కొంచెం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపధ్యం తెలుసుకోవాలి మనం:

పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభానికి దాదాపు రెండేళ్ల ముందే అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ (జవహర్ లాల్, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య-జె.వి.పి కమిటీ) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది. మద్రాస్ నగరంపై మాత్రం ఆంధ్రులు తమ హక్కు వదులుకోవాలని ఆ కమిటీ అభిప్రాయపడింది.

ఈ కమిటీ సిఫారసులను ఆంధ్ర ప్రాంత ప్రజానీకం పెద్ద వ్యతిరేకత లేకుండానే ఒప్పుకుంది.

ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అయితే నవంబర్ 12, 1949 నాడు విజయవాడలో సమావేశం అయి జె.వి.పి. కమిటీ సిఫారసులకు అమోదముద్ర వేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

(click on image for full size)

ఆ తీర్మానం అమోదించిన వారిలో ప్రకాశం పంతులు, కళా వెంకట్రావు, బులుసు సాంబ మూర్తి, ఎన్ జి రంగా వంటి హేమాహేమీలు ఉన్నారు.  ఈ తీర్మానంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అప్పటివరకూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అటు తమిళులూ ఇటు తెలుగు వారూ సంతోషించారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పంపకాలు చేయడానికి మద్రాస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 1949 నాడు 8 మంది సభ్యులతో కూడిన పార్టీషన్ కమిటీని నియమించింది.

(click on image for full size)

అందులో అంధ్ర తరఫున ప్రకాశం పంతులు, వెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిలు ఉండగా, తమిళుల తరఫున కుమార స్వామి రాజా, భక్తవత్సలం, మాధవ మీనన్, టి.టి. కృష్ణమాచారి ఉన్నారు.

పార్టీషన్ కమిటీ మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని జనవరి 26,1950 నాటికి ఏర్పాటు చేయాలని, ఆంధ్రకు వేరే రాజధాని నిర్మించాలని, మద్రాసు ప్రభుత్వం ఆంధ్రకు ఒక కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చింది.

దీన్ని ఆమోదించిన మద్రాసు ప్రభుత్వం ఏప్రిల్ 1, 1950 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *